2025 IPLలో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మ్యాచ్‌లో RCB విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెండా పాతింది. ముంబై ఇండియన్స్‌పై అపూర్వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో బెంగళూరు టీమ్ ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుందో. ముందు టాస్ ఓడి తొలుగు బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ 67 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 64 పరుగులతో జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టించడంతో కీలక పాత్ర పోషించారు. జితేష్ శర్మ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తూరు ఒక వికెట్ పడగొట్టాడు.
222 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగింది ముంబై ఇండియన్స్ ఛేజింగ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా.. వాంకడే స్టేడియంను హోరెత్తించాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఇందులో 4 ఫోర్లు, 4 భారీ సిక్సులు బాదడం విశేషం. హార్దిక్ పాండ్యా అయితే ఆకాశమే హద్దుగా తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 15 బంతుల్లో 42 పరుగులు చేశారు. 4 భారీ సిక్సులతో పాటు 3 ఫోర్లు కొట్టాడు. ఒక దశలో పాండ్యా జట్టును గెలిపిస్తాడని అందరూ అనుకున్నాడు. ఐతే 19వ ఓవర్లో హేజల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ (17), ర్యాన్ రిక్కల్‌టన్ (17) తక్కువ పరుగులే చేతినా.. క్రీజులో ఉన్నంతసేపు వేగంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గట్టుగా ఆడలేకపోయారు. చివరలో నమన్ ధిర్ 11 (1 ఫోర్, 1 సిక్స్) ముంబైకి ఆశలు రేకెత్తించినా.. ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ లో రజత్ పటిదార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
![]() |
![]() |