ఐపీఎల్ లో బారి ఫైన్ వేయడాo విషయం తెలిసిందే.నిన్న జరిగినా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచిన విషయం విదితమే. అయితే, ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కు ఐపీఎల్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు సమాచారం.ఎంఐ, ఆర్సీబీల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 64 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
![]() |
![]() |