ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరులో కామినేని మాట్లాడుతూ.."చేపలు, రొయ్యల పరిశ్రమ కష్టాల్లో ఉంది.
రొయ్యలకు అమెరికా దిగుమతి సుంకం పెంచడంతో.. 30 లక్షల మంది ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా పరిశ్రమపై 70 లక్షల మంది జీవిస్తున్నారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారంపై కేంద్రంతో మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారు" అని తెలిపారు.
![]() |
![]() |