కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల కాలంలోనే పలు గ్రామాలలో నూతన బోర్లు వేసి గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతోందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం కొండ్లోపల్లిలో మంత్రి నూతన బోరును ప్రారంభించి మోటర్ స్విచ్ ఆన్ చేసి గ్రామానికి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా రాయచోటికి నీరు సరఫరా చేస్తామన్నారు
![]() |
![]() |