ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన మనిషి ఎదుగుదలకి ఇన్ స్పిరేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 04:12 PM

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇందులో చంద్రబాబు జీవిత ప్రస్థానం యావత్తు చూపించారు. ఓ వ్యక్తి వ్యాఖ్యానంలో చంద్రబాబు జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ వీడియో సాగుతుంది. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ... 75 ఏళ్ల చంద్రబాబు గారి జీవితం రెండు నిమిషాల్లో చూపించిన అద్భుత వీడియో అని అభివర్ణించారు. జీవితంలో ఇన్ స్పిరేషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తే చాలు... కొండనైనా ఢీకొట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది అని పేర్కొన్నారు.


https://x.com/ministersubashv/status/1913829496131846159?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1913829496131846159%7Ctwgr%5Ee6ef46f7912a41179f188a6615129c0da90907fc%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F826812%2Fchandrababu-naidus-75th-birthday-minister-shares-inspirational-video






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com