నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు భారత్ త్రివిధ దళాల (భూసేన, నౌకా, వైమానిక దళాలు) ప్రతినిధులు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొని, ప్రస్తుతం కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు కీలక అంశాలపై స్పష్టతనివ్వనున్నారు.
ఇక సోమవారం భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. భారత్ ఇప్పటికే యుద్ధాన్ని నివారించేందుకు సానుకూలతను చూపిస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌తో కొన్ని కీలక అంశాలపై ఇంకా స్పష్టత అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా సింధు జలాల నిలిపివేత, క్రాస్ బోర్డర్ ఉల్లంఘనలు వంటి అంశాలపై భారత్ కొన్ని షరతులను కొనసాగించాలని యోచిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రెస్‌మీట్ ద్వారా త్రివిధ దళాల ప్రతినిధులు భారత ప్రభుత్వ వైఖరిని వివరిస్తారని అంచనా. చర్చల ముందు మీడియాకు సరైన సమాచారం అందించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది.
![]() |
![]() |