ఏలూరు జిల్లాలో ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొల్లేరు ప్రాంతానికి చెందిన బాలిక కుటుంబం చేపల చెరువుకు కాపలా ఉంటోంది. ఆ పక్కనే మరో చేపల చెరువుకు శ్రీకాళహస్తికి చెందిన చంద్రశేఖర్ (32) కాపలా ఉంటున్నాడు. బాలికను చంద్రశేఖర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ముఖంపై గాయాన్ని చూసిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో.. జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![]() |
![]() |