ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశం తీవ్ర వర్షాలతో కుదేలైంది. సుడ్‌కివు ప్రావిన్స్‌లో ఉన్న కసబా గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 120 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా కసబా నదిలో ప్రవాహం తీవ్రంగా పెరిగి, గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తింది. వరద నీటి ఉద్ధృతి అంతలా ఉందని, ప్రజలు పరుగులు పెట్టే లోపే చాలా ఇళ్లు నీట మునిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా మృతి చెందినట్లు సమాచారం.
అలాగే, 28 మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సహాయ బృందాలు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి.
ఈ వరదలు 150కిపైగా ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో, అనేక మంది నిరాశ్రయులయ్యారు. గ్రామంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరణ పనులు ప్రారంభించినప్పటికీ, దారి ముంచిన వరదలు సహాయక చర్యలను ప్రతిబంధిస్తున్నాయి.
ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, ప్రాథమిక వైద్యం అందించేందుకు యత్నిస్తున్నారు.
![]() |
![]() |