జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలానికి చెందిన లావనూరు గ్రామంలో చీనీకాయల దొంగతనం కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన రైతు ఉమామహేశ్వర్ రెడ్డి తన చీనీతోటలో దాదాపు 16 టన్నుల చీనీకాయలు దొంగలించబడ్డాయని ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా, మరో ఇద్దరు రైతుల తోటలలో కూడా చీనీకాయలు అపహరణకు గురయ్యాయని సమాచారం. ఈ ఘటనలపై గురువారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి స్పందిస్తూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించగా, బాధిత రైతులు భారీ నష్టాన్ని చవిచూశారని చెబుతున్నారు. చీనీకాయలు తరలించేందుకు భారీ వాహనాలు ఉపయోగించారని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |