ఐసీసీ డబ్ల్యూటీసీ 2023-25 ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేతతో సహా మొత్తం ఎనిమిది జట్లకు కలిపి WTC ప్రైజ్‌మనీని రూ.49.27 కోట్లుగా ఐసీసీ వెల్లడించింది. WTC ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు.. రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు 18.46 కోట్లుగా ఐసీసీ నిర్ణయించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్‌లో జూన్ 11-16 వరకు జరగనుంది. తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి.2025 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్.. లార్డ్స్ మైదానంలో జరగనున్నది. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది. గత ఏడాది టోర్నీలో రన్నరప్‌కు 8 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ కల్పించారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను పెంచే ఉద్దేశంతో ప్రైజ్‌మనీ పెంచినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఈసారి దక్షిణాఫ్రికా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన హోం సిరీస్‌లో ఆ జట్టు నెగ్గింది. 69.44 శాతం పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో నిలుచున్నది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంలో నిలుచున్నది.
![]() |
![]() |