ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18.05.2025 నుండీ 24.05.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 12:40 PM

1)మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)
వారం ప్రారంభంలో వృత్తి విషయంలో ఆలోచనలు. వృత్తిపరంగా ఊహించని వ్యక్తుల సహకారం కొరకు ఆకస్మిక అవకాశాలు.   సంతానం యొక్క ఆరోగ్యం, మీ సృజనాత్మకత  అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఆగుతూ వస్తున్న అభివృద్ధిలో  ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల స్వార్థ ఆలోచనలు ఇబ్బందిని, ఘర్షణని కలిగిస్తాయి. నిర్ణయ సామర్థ్యంలో, కమ్యూనికేషన్ విషయంలో, ఎదుగుదల సుదీర్ఘ ఆలోచనలు కలిగిస్తాయి.రాహు కుంభం, కేతు సింహం, గురు మిథున రవి వృషభ స్థానాలా ప్రభావం ఆర్థిక, లాభపరమైన అంశాలలో ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తులు భూములు కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త వ్యక్తులను, వారి ఆలోచనలను నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ అనవసర వ్యయములు, ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  వారం చివరిలో భాగస్వామితో  కలిసి తీర్థయాత్రలకు ప్రణాళిక. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రవచనాలు. ముఖ్యమైన పనులు తాత్కాలిక వాయిదా. ఆరోగ్య శ్రద్ధ, ఔషధ సేవ అవకాశాలు, సోదరు వర్గంతో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్లాలి.  మరిన్ని మంచి ఫలితాల కొరకు ఇష్టదేవత దేవాలయ సందర్శన మంచిది.


2)వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


వారం ప్రారంభంలో ఆత్మ విశ్వాసం కొంత తగ్గుతుంది దూర ప్రయాణములకి అవకాశము, మీఆర్ధిక, ఆరోగ్య, రుణములు పోటీలు అంశాలలో పెద్దల  యొక్క సలహా, సహకారం ఆశిస్తారు. ముఖ్యంగా తల్లి తండ్రుల ఆరోగ్య, సౌకర్య, అవసరాల కోసం దృష్టి సారిస్తారు. ఉన్నత విద్య కొరకు ఎదురు చూసే విద్యార్ధులకి విద్యావిషయాల్లో, పోటిల్లో కొంత సామాన్య ఫలాలు. ప్రస్తుతం ఉన్న వృత్తిలోబాధ్యతలు, నూతన శ్రమ. కొత్త పనులు, వ్యక్తుల పరిచయాలు. మోసానికి అవకాశములు. జీవిత భాగస్వామికి వృత్తిలో అవకాశములు దూర ప్రదేశముల్లో, మిత్రులు కొల్లీగ్స్ తో అభిప్రాయ బేధములు రాకుండా  వ్యవహారించాలి.  గృహ సంబంధ విషయాల్లో ఖర్చులు. పాత ఋణములు, వైరాగ్యఆలోచనలు  చికాకులు. నిర్వేదాని అధిగమించే దిశగా ప్రయత్నించాలి. వారము మధ్యలో  వారాంతంలో కుటుంబ స్త్రీల ఆరోగ్యముకై శ్రద్ధతో వైద్యుల ను కలిసే అవకాశములు. వృత్తిలో అభివృద్ధి లేదా నూతన ప్రయత్నాలు ఫలింపు.స్థిరాస్తులుకై ప్రయత్నములు. వారంతములో లాభములు అందినప్పటికి వాటిని ఆశతో వృద్ధి చేసే నేపద్యములో స్వార్ధపూరీత వ్యక్తుల వలన కొంత మోసపోయే అవకాశములు. గణేశ మందిరాలు శ్లోకలు ఉత్తమము.


3)మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలోప్రయాణాలు చేసేటప్పుడు స్వార్థపూరితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  సంతానమునకు విద్య సంబంధమైన విషయాల్లో అభివృద్ధి ఆశించిన ఫలితాలు పొందుతారు. శక్తి మించిన ఖర్చులు, రాహు కుంభ కేతు సింహ ప్రవేశం తో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో అవకాశాలు విదేశాలలో ఉండే ఆత్మీయుల సహకారంతో అభివృద్ధి.  ఆత్మ శక్తి పెరుగుతుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు, కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మిత్రులతో, తోబుట్టువులతో వివాదాలకి దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. నిరుద్యోగులకు, వృత్తి లో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన అవకాశాలు లభ్యం.  మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు.శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు పాత రుణాలు చెల్లిస్తారు.వచ్చిన లాభాలను సద్వినియోగ పరచుకోవడంలో మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఫలితాల కొరకు దుర్గా దేవి ఆరాధన మంచిది


 4)కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో రాహు కుంభరాశిలోనూ కేతు సింహరాశిలోనూ  మార్పులు, అదేవిధంగా రవి వృషభ రాశి లోనూ, గురు భగవానుడు మిధున రాశిలోనూ ప్రయాణాన్ని గమనిస్తే, జీవిత భాగస్వామి అభివృద్ధి, వ్యక్తిగత వృత్తి మొదలైన వాటి కొరకుఅనుకోనిఖర్చులు, ఆలోచనలు, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాలలో ఆలోచనలు.  ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆలోచనలు అనుకూలం.  వారం మధ్యలో ఆరోగ్య, ప్రయాణ, సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటలలో ఉద్వేగం కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరంపెట్టే అవకాశం ఉంది.


 


Vinod, [5/16/25 12:02 PM]


తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో, పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు. వారాంతంలో   వృత్తిలో అధిక బాధ్యతలు. శ్రమగౌరవం పెరుగుతుంది.  ప్రయాణాలు అలసట. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిదే.


5)సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలోబంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.  ఆధ్యాత్మిక ప్రయాణాలు,  గురువుల యొక్క సహకారం, ఆశీస్సులు, మధ్యలో నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. రాహు కుంభరాశిలోనూ కేతు సింహరాశిలోనూ  మార్పులు, అదేవిధంగా రవి వృషభ రాశి లోనూ, గురు భగవానుడు మిధున రాశిలోనూ ప్రయాణాన్ని గమనిస్తే ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమ వ్యక్తిగత అభివృద్ధి కొరకు  ప్రయత్నాలు అధికంచేస్తారు. నూతన అవకాశాలు.  గుర్తింపు, నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభం కన్నా, గౌరవం పెరుగుతుంది. వృత్తి విషయాలలో, సంతానం అభివృద్ధి ఆరోగ్య విషయాలలో ఘర్షణ. ఆలోచనలలో అధిక ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. గృహ అలంకార నిమిత్తం, కొత్త పుస్తకాల కొనుగోలు కొరకు, ఇంటిలో రిపేర్ల దృష్ట్యా, ఆకస్మిక ఖర్చులు. నిర్ణయ సామర్థ్యంలో ఇతరుల సహకారం తీసుకోవడానికి ఇష్టము కలుగదు. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు,ఆరోగ్యం శ్రద్ధ అవసరం. అనవసరమైన ఖర్చు  నియంత్రణ అవసరం.   మరిన్ని మంచి ఫలితాలు కొరకు శ్రీకృష్ణ దేవాలయాల సందర్శించడం మేలు.


6)కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


వారం ప్రారంభంలోరుణములు తీసుకునే ప్రయత్నాలు, ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు సమయానికి ఇవ్వడంలో జాప్యం. రాహు కుంభ రాశిలోనూ కేతు సింహరాశి లోనూ  మార్పులు, అదేవిధంగా రవి వృషభ రాశి లోనూ, గురు భగవానుడు మిధున రాశిలోనూ ప్రయాణాన్ని గమనిస్తే సంతానం  అవసరాల నిమిత్తం ఖర్చు. వారి ఆరోగ్య, అభివృద్ధి అంశాలలో  ప్రత్యేక శ్రద్ధ. స్థిరాస్తుల పై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం.  వృత్తి చేసే ప్రదేశంలో అధిక బాధ్యతలు శ్రమ గౌరవం ఉన్నప్పటికీ  అనవసర వ్యక్తుల ప్రవర్తన, జోక్యం చికాకు కలిగిస్తుంది.  తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, దూరవిద్యా, న్యాయ సంబంధ విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇబ్బంది కలిగించే అలవాట్లకు, వ్యసన పరులైన స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో  ముఖ్యమైన పనులు, ప్రయాణములు వాయిదా పడే అవకాశం. కుటుంబముతో బేధాలు రాకుండా ఆర్ధిక సంబంధాలలో, మాటల వల్ల, ఆచితూచి వ్యవహరించాలి.  ఆరోగ్యముకి శ్రద్ధతీసుకోవాలి, సమయానికి ఆహారము విశ్రాంతి అవసరం.నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.  మరిన్ని మంచి ఫలితముల కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శన మంచిది.


7)తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభంలోతల్లి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు స్తిరాస్తుల, వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కొరకు, స్వగ్రామ సందర్శన కొరకు తల్లితో సంప్రదిస్తారు. విద్య సంబంధమైన విషయాల కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ చేస్తారు.  ఆరోగ్యముకి శ్రద్ధ తీసుకోవాలి, సమయానికి ఆహారము విశ్రాంతి అవసరం.నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో శ్రీ హయగ్రీవాయ నమః మంత్రం జపించుట మేలు.  ఆలోచనలు ప్రతిపాదించుటలో ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇతరులకు సహకరించడంలో స్వార్థంతో ఆలోచించడం వలన ఆశించిన లాభాలు తగ్గుతాయి. సంతానం అభివృద్ధి విషయంలోని ఇంతకు ముందు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయ వ్యక్తులతో విందు వినోదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. వారికి బహుమానాల కొరకు, ప్రయాణాలు కొరకు అనుకోని ఖర్చులు చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధతో ఖర్చు చేస్తారు. పాత రుణములు కొంతవరకు వసూలు. సంఘంలో కొత్త పరిచయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులుఆలోచనలు, మైత్రిబంధాలు. వారాంతంలో వైవాహిక జీవితం అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం. మరిన్ని మంచి ఫలితాలు కొరకు దత్తాత్రేయ మందిరాలు  దర్శించడం  మేలు.


 


8)వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)వారం ప్రారంభంలోవ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు.  వృత్తిపరమైన విషయంలోసామర్థ్యాలుపెరుగుతాయి,  నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు.  దూర ప్రదేశాలలో ఇంటర్వ్యూలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాహుకుంభ ప్రవేశం, కేతు సింహ ప్రవేశం తో,  విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో పోటీలలో అనుకున్న ఫలితాలు. స్థిరాస్తుల అభివృద్ధి కొరకు  ప్రయత్నాలు సామాన్య ఫలాలు. ఎక్కువ అనవసర ఆలోచనలతో హృదయాందోళన. సంతానముతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. క్రీడారంగంలో ఉండే వాళ్ళు పోటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు పై దృష్టి, మీ ఆలోచనలకి వారి ఆలోచనలకి సమన్వయం లేకపోవడం వల్ల చికాకులు. ముఖ్యంగా మగ పిల్లల  అభివృద్ధి విషయంలోనూ, స్నేహముల విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ వ్యసనములకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. పాత రుణములు చెల్లిస్తారు.  మరిన్ని మంచి ఫలితాల కొరకు గణేష్ పూజ, మందిర దర్శనము మంచిది


 


9)ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


వారం ప్రారంభంలో కుటుంబంతో కలిసి చర్చలు, ఆర్థిక సంబంధాలలో ఆలోచనలు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, దైవ దర్శనం దూర ప్రయాణాలు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. ఎక్కువ శాతం సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్ తో సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.  వారం మధ్యలో ముఖ్య అంశాలలో స్థిరాస్తులు విషయంలో తోబుట్టువులతో వాదనలకు దూరంగా ఉండాలి. రాహు కుంభ ప్రవేశం, కేతు సింహ ప్రవేశం, గురు మిథున రవి వృషభ స్థానాలు తో సామర్థ్యం పరాక్రమం పెరుగుతాయి, మిత్ర బృందం సహకరిస్తారు, రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వారి మీద, విజయాన్నిసాధిస్తారు. రోగ నిరోధక శక్తి విషయంలో, బంధుమిత్రులతో జాగ్రత్తలు తీసుకోవాలి.  వృత్తి విషయంలో శ్రద్ధ వహించాలి.విద్యార్థులు పోటీ పరీక్షలు, అభివృద్ధి విషయంలో తగిన విధంగా కృషి చేయాలి.  తండ్రి పెద్దలతో వాదోపవాదాలకు లోను కాకుండా తగిన విధంగా భూవిషయాలలో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్లాలి. మంచి ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శ్లోకములు, దేవాలయ సందర్శన మంచిది.


10)మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వారం ప్రారంభంలో కుంభ రాహు, సింహ కేతు, రవి వృషభ, గురు మిథున స్థానాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు. ఆరోగ్య విషయం అనుకూలత.   కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో, కొత్త వ్యక్తులతో  వాగ్వాదానికి, వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల, ముఖ్యంగా సంతానము ఆరోగ్య, అభివృద్ధి విషయంలోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు.  ఆత్మీయుల ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు. దగ్గర ప్రయాణాలకు, మిత్రులతో సంప్రదింపులకు అవకాశం. వృత్తి లో కమ్యూనికేషన్ సమస్యను అధిగమించాలి. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవహరిస్తూ భవిష్య ప్రణాళికలను చర్చిస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఉద్వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల అది ఆత్మీయ వ్యక్తులకు  స్వార్థంగా అనిపించుటచే కొంత ఇబ్బందులు అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి. వారం చివరిలో వాహనాలు నడిపే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆశించిన వృత్తి విషయంలో అనవసర వైరాగ్యాలకు లోను కాకుండా ముందుకు వెళ్లాలి.  మరిన్ని మంచి ఫలితాలు కొరకు  దత్తాత్రేయ స్వామి ఆరాధన,  దర్శనం మంచిది.


11)కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభం కుంభ రాహు సింహ కేతు వృషభ రవి మిథున గురు గోచారం వ్యాపార విస్తరణ, ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య  సంతానము కొరకు ఖర్చులు, షాపింగులు అధికంగా ఉంటాయి. వ్యాపార శ్రమ విశ్రాంతి లోపం కొంత శారీరక నిస్సత్తువ కలిగిస్తుంది.  వారం మధ్యలో ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా స్థిరాస్తులు అభివృద్ధి కొరకు, విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, ఆకస్మిక లాభాలు ఇంతవరకు ఆగిన ఆర్థిక విషయాలు కొంత ముందుకు సాగుతాయి. వారం చివరిలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఇతరుల సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో మంతనాలు. కుటుంబంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ బేధాలు రాకుండా  జాగ్రత్త తీసుకోవాలి. శారీరక శ్రద్ధ, నూతన భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కొత్త ప్రదేశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. తల్లి ఆరోగ్య విషయం మీద, వ్యక్తిగత వ్యవసాయ భూములు, స్థలములు మీద శ్రద్ధ తీసుకుంటారు. మధ్యవర్తిత్వం వహించే వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనల వల్ల కూడా సంఘంలో స్నేహసంబంధాలు, మైత్రి బంధాలు ఇబ్బందులు కలుగచేస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గా దేవి ఆరాధన దేవాలయ సందర్శన మంచిది


 


Vinod, [5/16/25 12:02 PM]


12)మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


వారం ప్రారంభంలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు, నూతన గృహ వాహన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుంభ రాహు సింహ కేతు ప్రవేశం తో దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. అనవసర వృధా ఖర్చుల విషయంలో చూసి వ్యవహరించాలి, న్యాయ సంబంధమైన అంశాల మీద చర్చలు ముందుకు సాగుతాయి.  దూరపు ప్రదేశాలలో నూతన అవకాశాలు కలిగించినప్పటికీ నిర్ణయ సామర్థ్యం లోపంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు.రుణము లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  విజయము సాధించడానికి చేసే కార్యక్రమాలలో శ్రద్ధ. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.  వారం చివరిలో ఘర్షణతో కూడిన మాటల వల్ల వ్యక్తులతో మాట పట్టింపులు.ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, అందిన ఆర్థిక అంశాలలో, వ్యవహరించే విధానంలో నిదానం అవసరం.కమ్యూనికేషన్ విషయంలోనూ, కొలీగ్స్ తో, పెద్దలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.    మంచి ఫలితాల కొరకు దుర్గా శ్లోకాలు అష్టోత్తర శతనామావళి మంచిది.


(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa