కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ, పాకిస్థాన్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను నిలదీశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గట్టిగా ప్రశ్నించారు.ఆపరేషన్ సిందూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో జైశంకర్ మౌనం వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదని, అది విపత్కర పరిణామం అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. "మరోసారి అడుగుతున్నాను, పాకిస్థాన్‌కు ముందే సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం?" అని జైశంకర్‌ను సూటిగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా ఈ తాజా ట్వీట్ చేశారు.
![]() |
![]() |