ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25.05.2025 నుండీ 31.05.2025 వరకు ద్వాదశ రాశి ఫలితములు( వార ఫలములు)

Astrology |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 11:57 AM

మేషరాశి.వారం ప్రారంభం ఆశించిన ఆర్ధిక,వృత్తి విషయాల్లో  వృద్ధి ఉన్నప్పటికి అది వేగం వత్తిడితో కూడి ఉంటుంది.ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.తల్లి ఆరోగ్యం,గ్రామీణ వ్యవసాయం, విద్యార్ధులకి ప్రాధమిక విద్య, స్థిరస్తుల సంబంధ అంశాలు ఆలోచనకి వస్తాయి. డ్రైవింగ్ చేసేటపుడు  దృష్టి జాగర్త. వారము మధ్యలో ఆర్ధిక విషయములు అనుకూలం. జీవిత భాగస్వామి షాపింగ్, బహుమానములకి కొరకు ఖర్చులు. వారికి దూరప్రదేశాల్లో వృత్తి అవకాశములు, బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబమున బంధువుల రాక. వారితో కొంత మంచి వినోదత్మక సమయాన్ని గడుపుతారు.మాటలు మాట్లాడేటపుడు అలోచించి మాట్లాడాలి అపార్ధము లేకుండా..విద్యార్థులకి అనుకూలం. ముఖ్యముగా వ్రాత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనత్మాకత పెరుగుతాయి. గణిత,చార్టెడ్ అకౌంటెన్సీ, ఆర్ధికశాస్త్ర విద్యార్ధులకి  అనుకూలం.దగ్గరప్రయాణములు, పరక్రమము, శక్తి సమర్ధ్యములు పెరుగుతాయి. బాలల లేఖన సామర్ధ్యము,జర్నలిస్ట్స్,రచనరంగం వారికి గుర్తింపు.తోబుట్టువులతో సమావేశములు. వారం చివరిలో తల్లి ఆరోగ్యము శ్రద్ధ. నిస్వార్ధముగా ఆలోచిస్తే గౌరవం పెరుగుతుంది. కుటుంబవాతావరణం ఘర్షణ, కొంత సౌక్యలోపము.మరిన్ని మంచి ఫలితములకి సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రములు మేలు.


2)వృషభరాశి: వారము ప్రారంభములో దగ్గర ప్రయాణాలు, వత్తిడి, తోబుట్టువులతోఆకస్మిక ఘర్షణ.పెట్టుబడుల విషయం లో కొత్త వారిని నమ్మెటపుడు జాగ్రత్తలు అవసరం. ఆత్మీయుల కై ఖర్చులు, సహకారము చేస్తారు, స్వార్ధముగా ఆలోచించకుండా సహకారము చేస్తే అపార్ధములు ఉండవ్ తద్వారా గౌరవము పెరుగుతుంది. వారము మధ్యలో ఆలోచనలు బాగుంటాయి ఆర్ధిక విషయాల్లో కుటుంబ, స్థిరస్తుల అంశాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతశ్రద్ధ. రోగనిరోధక శక్తి బాగుంటుంది . ఋణములు తీరుస్తారు . కొత్త గవర్నమెంట్ ఋణములకి ప్రయత్నాలు.ఆలస్యమైన పనులు ముందుకి వెడతాయి.చమత్కా రముగా మాట్లాడి పనులు సాధిస్తారు.విద్యార్ధులకి అభివృద్ధి. ప్రియమైన వారితో అనుకూలం, గొడవలు సమసిపోతాయి. వారము చివరిలో  వారసత్వపు ఆస్తులు చర్చలకి తోబుట్టువులతో, దగ్గర ప్రయాణములకి అవకాశములు.జీవిత భాగస్వామి తో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు.మరిన్ని మంచి ఫలితములకి సూర్యనారాయణస్వామి అష్టకం మంచిది.


3) మిథునరాశి: వారము ప్రారంభంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మాటలు,   ఇతరులు స్వార్థంగా భావించటం వల్ల విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నరీత్య జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి, సమయానికి ధనం చేకూరడం లో కొంత ఆటంకాలు. అనుకోని దగ్గర ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉండే తోబుట్టువులు సంతానం విద్య, వృత్తి సంబంధ అభివృద్ధికి  సహకరిస్తారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారము చివరిలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. వృత్తిలో శ్రమ ఉన్నప్పటికీ అధిక అభివృద్ధి ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆలోచనలని పంచుకోవడానికి ఆత్మీయులని సంప్రదిస్తారు. గవర్నమెంట్ ట్యాక్స్ చెల్లిస్తారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.


4) కర్కాటక రాశి : వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలు మీద, అభివృద్ధి కొరకు శ్రమ ఎక్కువ పడి అధిక శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఘర్షణతో కూడిన ఆలోచనలు ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకొనుట మంచిది. సమయానికి ఆహార స్వీకరణ, తగిన విశ్రాంతి మంచిది. నిర్లక్ష్యం తగదు. వారం మధ్యలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, ఆశించిన పనులు కొంతవరకు ముందు కడతాయి, గృహ, వాహన  విషయాలు, ఆర్థిక విషయాలు కదలికలు కొంత ఆశ కలిగిస్తాయి. రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. నూతన వృత్తి కొరకు ప్రయత్నాలు. గుర్తింపు గౌరవం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచిస్తారు. క్షేత్ర సందర్శన. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు విదేశీ అవకాశాలు. శత్రువుల మీద విజయం సాధిస్తారు, పుణ్య బలం పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు, పెద్దల గురువుల ఆశీస్సులు


గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో నూతన ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో స్వార్థ పూరితవ్యక్తులకి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణ, మందిర దర్శనం మంచిది.


5) సింహరాశి
వారం ప్రారంభంలో తండ్రి ఆరోగ్య మీద శ్రద్ధ తీసుకుంటారు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన దూర ప్రయాణాలు పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి ఘర్షణ, ఖర్చు, శ్రమతో కూడిన అవకాశాలు. వృత్తిపరమైన ప్రయాణాలకు, వృత్తిపరమైన గౌరవం, అభివృద్ధికరమైన అవకాశాలు. ప్రమోషన్లు, మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి బహుమానాలు, స్వయంగా బిజినెస్ చేసుకునే వారికి, ముఖ్యంగా స్త్రీలకు బ్యూటీ క్లినిక్, వస్త్రములు, మొదలైన రంగంలో ఉండే వారికి అభివృద్ధి. కుటుంబసభ్యులతో అనుకూలం.సంతానమునకు విద్యాసంబంధ అంశాలలో జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి, లాభదాయకంగా ఉన్నప్పటికీ, వారి అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్ధిక పరముగా మంచి ఆలోచనలు వస్తాయి.కాని ఇంతకుముందు ఋణములు మీ వద్దతీసుకున్న వ్యక్తులు ఇవ్వటం లో చేసే జాప్యము వల్ల మీకు నమ్మకం సన్న గిల్లుతుంది. తల్లి రండ్రులకొరకు వారి సౌకర్యములకొరకు స్వార్ధము లేకుండా ఖర్చులు చేయుట వల్ల మీ గౌరవం పెరుగుతుంది. మరిన్ని మంచి ఫలితములకి సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు దర్శనం, శ్లోకాలు పఠన మంచిది.


6)కన్యారాశి:వారము ప్రారంభములో ముఖ్య విషయాల్లో కొన్ని వాయిదాలు అనగా రావాల్సిన ఆర్ధిక అంశాలు, ప్రయాణాలు, ఎదురుచూసే మంచి విషయాలు వాయిదావల్ల చికాకులు. రీసెర్చ్ విద్యార్ధులకి అనుకూలము. భూసంబంధ పెట్టుబడులకి తోబుట్టువులని మిత్రులని సంప్రదిస్తారు. వారము మధ్యలో కొంత అసంతృప్తి పెద్దల సహకారము ఆర్ధిక అంశాలలో మాట సహాయములో అందుటలో ఆలస్యాలు. స్త్రీలతో, ఉన్నత స్థాయి, రాజకీయ పలుకుబడికల వ్యక్తులు తో విబేధాలు రాకుండా జాగ్రత్త గా వ్యవహరించి నిదానముగా ముందుకు వెళ్ళాలి. వారము చివరిలో తల్లి భాగస్వామి తో సంప్రదింపులు. స్థిరస్తులకి పెట్టుబడి కై నిర్ణయాలు. భాగస్వామికి వృత్తిలో శ్రమ గౌరవం. కమ్యూనికేషన్ బాగుంటుంది ఆకస్మిక ధనలభము ఎదురుచూసిన వర్తమానాలు  అందుకుంటారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులని నమ్మెటపుడు జాగర్త. మరిన్ని మంచి ఫలితాలకి  నవగ్రహ ఆలయ సందర్శన మంచిది.


7) తులారాశి:  వారము ప్రారంభములో  జీవిత భాగస్వామితో కలిసి వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. వృత్తిలో ఆటంకాలు, స్వార్ధపూరిత వ్యక్తుల వల్ల మిగతా వారితో గౌరవం తగ్గుతుంది.ఆ విషయంలో జాగర్త అవసరం.ఆకస్మిక లాభలు రావాల్సిన చోట రహస్య శత్రువుల వలన వాయిదాలు,విభేదాలకి కొంత అవకాశము, ముఖ్యముగా మీ వ్యాపారము లో ఆపొనెంట్స్ వలన,అలాగే  స్త్రీల వలన  ఘర్షణలకి అవకాశాలున్న దృష్ట్యా  ఎవరితోనూ వైరము రాకుండా మాటల వల్ల జాగర్త గా ప్రణాళిక పరముగా ముందుకు వెళ్లి సమస్యలు అ దిగమించాలి. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. ఆధ్యాత్మికట పెరుగుతుంది. కమ్యూనికేషన్ విషయములో జాగర్త అవసరము. సహకారముతో, తెలివితేటలతో, పెద్దల ఆశీస్సులతో శత్రువులని జయిస్తారు వారాంతములో. వృత్తి పరముగా ఇబ్బంది పెట్టే స్వార్ధపరులని అధిగమిస్తారు కుటుంబ సభ్యులు భాగస్వామి తో  కలిసి పరిష్కారాన్ని ఎంచుకొని.మరిన్ని మంచి ఫలితలకి దుర్గాదేవి ఆలయదర్శనం మంచిది.


8) వృశ్చిక రాశి : వారము ప్రారంభములో శ్రమతో పనులు ప్రారంభిస్తారు ముఖ్యముగా గృహ సంబంధ అంశాలై, మీ వ్యక్తిగత దైనందన, వృత్తి విషయాల్లో ఆకస్మిక మార్పులు.తద్వారా అసంతృప్తి అధికము.ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.వారము మధ్యలో వృత్తిలో గౌర వం బాధ్యతలు పెరుగుతాయి . ఉన్నత స్థాయి అధికారులతో విబేధాలు. నూతన పరిచయాలు,వారసత్వపు ఆస్తులపై ఘర్షణ, తండ్రి తరపు పెద్దలు తో చర్చలు. పనుల్లో జాప్యము. భాగస్వామి తో కొత్త ప్రదేశాలకి వెళతారు. ప్రశాంతతకి. కుటుంబముతో విందు, ఆధ్యాత్మిక ప్రదేశాలు. సంతానము అభివృద్ధికి వారి విద్య,వస్తువులకు,ఖర్చులుఅధికము.అయితే ఆ విషయముల్లో అభిప్రాయాబేధములు రాకుండా జాగర్త అవసరము సంతానము, ప్రియమైన వారితో. విదేశాల్లో ఉండే సంతానముతో చర్చలు. వారంతములో దూర ప్రయాణాలు, ఉన్నత విద్యాకాయి ప్రణాళికలు. ముఖ్యముగా విదేశీ వ్యవహారాల్లో విద్య నిమిత్తం ఖర్చులు, కొత్తవారిని నమ్మి ముందు కేడితే తగిన జాగర్తలు అవసరము.మరిన్ని మంచి ఫలితలకి విగ్నేశ్వర ఆరాధన మంచిది.


9) ధనుస్సు రాశి : వారము ప్రారంభములో ఆలోచనలు బాగుంటాయి. ఆకస్మిక ఖర్చులు. సంతానం విద్య ఆరోగ్యములకి. దీర్ఘకాలికపెట్టుబడులకి ఆలోచిస్తారు. సంతానముతో మీ ప్రియమైన వారితో మాట్లాడేటపుడు స్వార్ధరహితముగా ఆలోచిస్తే పరిస్థితులు అనుకూలము. పనులు ముందుకు వెడతాయి.వారము మధ్యలో శ్రమఅధికము. నిరుద్యోగులకి కొత్త అవకాశములు.ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులు, వ్యాపారస్తులు సహకరిస్తారు. ఋణములు అందుతాయి. స్త్రీలతో మాట పట్టింపులు విబేధాలకి అవకాశాలు, వీలైనంత జాగర్త అవసరము.తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ. భాగస్వామి తో మాటపట్టింపులకి దూరముగా ఉండాలి. వారి ఆరోగ్యము కై వారి కుటుంబ సభ్యులఅవసరములకై ఆకస్మిక ఖర్చులు. సమయానికి ధనము అందుతుంది. వారంతములో అనవసర ఘర్షనలకి,చికాకులకు, ప్రయాణములకి దూరము మంచిది.డ్రైవింగ్ చేసేవారు శ్రద్ధ అవసరము.మంచి ఫలితాములకి శ్రీ కృష్ణ మందిరం దర్శనము,శ్లోకములు మంచివి.


10) మకరరాశి : వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలిసి గృహానికి, వాహన సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేస్తారు. స్థిరస్తుల, పెట్టుబడుల మీద దృష్టి సారిస్తారు. వాతావరణము ఘర్షణగా ఉంటుంది నిర్ణయ లోపములతో కొన్నిసార్లు. వారము మధ్యలో సంతాన విషయములో, వారి అభివృద్ధి, భవిష్యత్తు భాగస్వామితో కలిసి సృజనత్మక నిర్ణయాలతో ఆధ్యాత్మిక మందిరం దర్శనములు. కాని సంతాన ఆలోచనలు వారి స్వంత నిర్ణయాలు ముఖ్యనుగా ఉన్నత విద్య, విదేశీ వృత్తి సంబంధ విషయాల్లో మీ ఆలోచనలకి కొంత వ్యతిరేకతలు చికాకులని కలిగించే అవకాశమున్నా నెమ్మదిగా సర్దుకుంటాయి.తోబుట్టువులతో సంప్రదిస్తారు. ముఖ్యముగా దూరప్రదేశాల్లో ఉన్న వారితో సుదీర్ఘ చర్చలు.శత్రువులు ఇబ్బంశీ పెట్టటానికి చేసే ప్రయత్నలని మీ నైపుణ్యముతో అధిగమిస్తారు. విదేశీ ప్రయాణమునకు అవకాశములు. బంధువులతో మాట పట్టింపులకి దూరం ఉండాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో స్వార్ధపోయిరీతమైన వ్యక్తులు ఇబ్బంది పెట్టే అవకాశములున్న అధిగమిస్తారు.మంచిఫలితలకి విగ్నేశ్వర ఆరాధన మంచిది.


11) కుంభరాశి :  వారము ప్రారంభము అనుకూలము. శక్తి సామర్ధ్యములు పెరుగుతాయి. సహకారము లభ్యము. కమ్యూనికేషన్ బాగుంరుంది. శ్రమతో పనులు సాధిస్తారు. గృహ వాతావరణము విద్యార్ధులకి ప్రశాంతత లేక పెద్దలకి కూడ కొంత అసౌకర్యము.తల్లి తరపు బంధువులు  రాక పోకలు.వారము మధ్యలో ఆర్ధికముగా బాగుంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా, మాట నిలబెట్టుకోవటం కష్టము.కుటుంబములో చిన్న ఫంక్షన్,ఆ విషయములో కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ చిన్న చిన్న విషయాల్లో.సంతానము అభివృద్ధి, వారికొరకు షాపింగ్స్, ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు, కుటుంబ ఆదాయం పెరుగుతుంది వ్యాపారము వృద్ధి. వారితో కలిసి సమయాన్ని సద్వినియోగం చేస్తారు. శక్తి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు.వ్యాపార విస్తరణకి మిత్రులతో సంప్రదింపులు.మంచి ఫలితలకి దుర్గాదేవి ఆరాధన మంచిది.


12) మీనారాశి:వారము ప్రారంభము ఆర్ధిక విషయాల్లో కొంత అసంతృప్తి. కుటుంబముతో మాట పట్టింపులు వాగ్ వాదములకి దూరము ఉండాలి. కుటుంబ ఆర్ధిక అంశాలలో ఉద్వేగాలు ఎమోషన్స్ అధికము.వారము మధ్యలో  శక్తి సమర్ధ్యలు పెరుగుతాయి నిర్ణయాలు స్థిరము, వ్యక్తులు సహకరిస్తారు తండ్రి పెద్దలు పలుకుబడి కలవ్యక్తుల సహకారముతో పనులు సాధిస్తారు. జీవితభాగస్వామీతో నిర్ణయాలు అమలు పరుస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. మీపై శ్రద్ధ పెరుగుతుంది అలంకరణ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ. నిరుద్యోగులకి నూతన అవకాశములు. బద్దకముతో పనులు వాయిదా వేయకుండా ముందుకు వెడితే లాభము. చేస్తున్న వృత్తి విషయాల్లో కొత్త నిర్ణయాలు.స్వతంత్ర ఆలోచనలతో ముందుకు వెడతారు. స్వగ్రామం సందర్శనకు ఇష్టత. వారము చివరిలో సంతానముతో ప్రియమైన వారితో ఘర్షనాలకు దూరము ఉండాలి.ఆర్ధిక విషయాల్లో వేగముగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆత్మీయ సంబంధాలు దెబ్బతినే అవకాశములున్నాయి.నెమ్మదిగా వ్యవహారించాలి. మానసిక ఆరోగ్యమునకు యోగ మెడిటేషన్ మంచివి. మరిన్ని మంచి ఫలితములకి  విష్ణుసహస్రనామం మంచిది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa