ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22.06.2025 నుండీ 28.06.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:41 AM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా, ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు పోటీ తత్వం పెరుగుతుంది, రుణములు చెల్లిస్తారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అనవసర ఖర్చులను కొంతమేర నియంత్రించుకోగలుగుతారు. రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తలు అవసరం, బాతృ వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కొత్త పనులు మొదలు పెడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి సహకరిస్తారు. వారం మధ్యలో కుటుంబ వ్యవహారాలలో, ఆర్థిక విషయాలలో అనవసర వ్యక్తుల ప్రమేయాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలుకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించాలి అన్న విధానాల్లో శ్రద్ధ తీసుకుంటారు. వారం చివరిలో  నూతన వాహన కొనుగోలు కొరకు, భాగస్వామికి బహుమానాల కొరకు వెచ్చిస్తారు. ధైర్యంగా సాహసంగా ముందుకు పెడతారు, కానీ ప్రతి విషయంలో,బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


వారం ప్రారంభంలో ఫలితములు గమనించగా సంతాన సంబంధమైన, పెట్టుబడులు విషయాలలో, కొంత చికాకులు. ఉద్వేగాల అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక ఖర్చులు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి అవసరం, వృత్తిపరమైన ప్రయాణములు. జీవిత భాగస్వామి తోను వారి యొక్క బంధువులతో మాట్లాడేటప్పుడు, అనవసర అపార్థములకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం. పౌరుషం నాయకత్వ లక్షణాలు ఆదిపత్య ధోరణిని విడనాడాలి. చిన్న చిన్న విషయాలకి కలహములు, అపార్థములు ఏర్పడే అవకాశం ఉన్న రిత్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణములు చేయునప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ సందర్భాలలో విష్ణు: గరుడ వాహన అనే శ్లోకాన్ని పట్టించడం మేలు. వారం చివరిలోసామర్థ్యం పెరుగుతుంది, షాపింగులు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా తోబుట్టులతో, భాగస్వామితో అనవసర అపార్థములు తగ్గుతాయి. మంచి ఫలితాల కొరకు లలితా దేవి శ్లోకాలు అష్టోత్తరాలు, లలితా సహస్రనామం మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా గృహ వాహన, తల్లి ఆరోగ్యం, వ్యవసాయ సంబంధం అంశాలు కొంత అసౌకర్యం,మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి అవసరం. లాభ చంద్రసంచారము చే సంతానముతో అనుబంధము అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది పెరుగుతుంది, ఎదురుచూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు. ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. వారం మధ్యలో అనవసర ఖర్చులు, వాగ్వాదములకు దూరంగా ఉండాలి. తోబుట్టువులతో ముఖ్యముగా అన్నదమ్ములతో సఖ్యత అవసరం.సంతానం నుంచి బహుమతులు అందుకుంటారు, షాపింగులు విందు వినోదాలు, మంచి ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యము తగదు, వారం చివరిలో మాటలతో పనులు సాధించుకుంటారు,  మరిన్ని మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మంచిది.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రవి మిధున రాశిలోకి ప్రవేశించడంవ్యయ ప్రభావం కొంత ఖర్చులు, తదుపరి దైర్య సాహసాలు పెరుగుతాయి నిర్ణయం సామర్థ్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన విషయాలలో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన పనులలో వేగము,  ఉత్సాహము. గురువులు పెద్దలు ఆశీర్వచనాలు, ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయాణాలకి కొంత అవకాశములు. వారం మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా విదేశాలలో ఉండే తోబుట్టువులు, స్నేహితులు సహకారం మరియు బహుమానాల రూపంలో కూడా అందుకుంటారు. నూతన వాహనాలు, గృహములు సంబంధించిన అంశముల మీద విస్తృతంగా దృష్టి సారిస్తారు. వారం చివర్లో కోపాన్ని పౌరుషాన్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయం మీద దృష్టి సారించాలి. వృత్తికి సంబంధమైన విషయాలలో ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. వాహనాల నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలో  మాటలు విషయంలో. కుటుంబ వ్యవహారాలలో, గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో, ఆర్థిక అంశాలలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక చికాకులు ఇబ్బంది పెట్టే విధానం. అనవసరమైన ఖర్చు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారము మధ్యలో వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు అవకాశం. బాధ్యతలు పెరుగుతాయి. అనవసర విమర్శలకు దూరంగా ఉండాలి. వారం చివరిలో సహకార లబ్ధి, ఆశించిన ఫలితాలు పొందుతారు ఆర్థిక విషయాలు అనుకూలం, ఎంతగానో ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశము నుంచి ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి, బంధు వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. అలవాట్లకి కూడ దూరం మంచిది. మరిన్ని మంచి ఫలితములు కొరకు గణేష్  ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


వారం ప్రారంభంలో ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు ఆటంకాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ప్రయాణాలలో చికాకులు, అనవసరమైన వ్యయాలు, ఆశించిన అంశాలలో చాలా సామాన్య ఫలితాలు ఇస్తాయి. కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రదేశాల నుంచి  సమాచారాలు కొంత ఆనందాన్ని ఇస్తాయి. పౌరుషం పెరుగుతుంది,  కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. వారం మధ్యలో దూర ప్రయాణానికి, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి విదేశీ అవకాశా ములు. ఇతరుల సహకారాన్ని తీసుకునేటప్పుడు వైరాగ్య ధోరణిని వదిలేయాలి. తోబుట్టువులు తో వైరికి దూరంగా ఉండాలి. వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేస్తారు, శ్రమ అధికం. వారం చివరిలో ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.  మరిన్ని మంచి ఫలితాల కొరకు లలితా దేవిని ప్రార్థించట మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభంలో చంద్రసంచారం, పరిశీలించగా అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి, ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం, ఆరోగ్యము తగిన శ్రద్ధ తీసుకోవాలి. అయితే చంద్రుని ప్రభావం వల్ల సంఘంలో గుర్తింపు గౌరవం, చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధన రాబడి, వారం మధ్యలో తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత ఆందోళనను, అశాంతిని కలిగిస్తాయి. నిరాసానిస్పృహాలను అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునేందుకు యోగా మెడిటేషన్ చేయాలి. వారం చివరిలోవృత్తిపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక పెరుగుతుంది, అశాంతిని నదిగమిస్తారు, దైవచింతన  సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు.  మరిన్ని మంచి ఫలితాలు కొరకు దుర్గా దేవి ఆరాధన మంచిది.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


వారం ప్రారంభంలో  ఆశించిన పనులలో విజయం, ఆర్థిక లాభం, ఆగుతూ వస్తున్న అనేకమైన పనులు ముందుకు వెళతాయి. సంఘంలో గుర్తింపు గౌరవం, మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి, శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనుల జరగడానికి సూచనలు. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకో గలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద మీకు నమ్మకం, స్థిరమైన అభిప్రాయాలు.  మధ్యలో వ్యాపార విస్తరణ స్నేహ సంబంధాలు బలపడతాయి, నూతన పరిచయాలు విందు వినోదాలు, భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడులకి ఆలోచనలు, జీవిత భాగస్వామితో నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు. వారం చివరిలో ప్రయాణాల్లో చికాకుల్ని, అధిగమించాలి.ఆకస్మికంగా అనవసరమైన ఖర్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలలో శ్రద్ధ,  మరిన్ని మంచి ఫలితములు కొరకు సూర్యనారాయణస్వామి ఆరాధన మంచిది.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


 వారం ప్రారంభంలో  వృత్తి సంబంధమైన విషయాలలో అధిక శ్రమతో ముందుకు వెళతారు. నూతన వృత్తులకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు. గౌరవం బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాటామంతి. ఆలోచనలు ఫలిస్తాయి, సంతానమునకు అభివృద్ధి, ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రుణాలు చెల్లిస్తారు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలు అనుకూలం, వృత్తిని పుణ్యాలను పెంచుకుంటారు. తగిన గుర్తింపు గౌరవం. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. కంటి ఆరోగ్యం లో శ్రద్ధ తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, ఆకస్మిక: విమర్శలకు,సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలకు అవకాశం,  మరిన్ని మంచి ఫలితాలు కొరకు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వారం ప్రారంభంలో  చంద్రసంచారం, ఫలితా అంశాలు గమనించగా తండ్రి ఆరోగ్యశ్రద్ధ తీసుకుంటారు, పెద్దలతో ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. గవర్నమెంట్ పనులలో ఉన్నత స్థాయి అధికారులు రాజకీయ నాయకుల సహకారాన్ని కోరుకుంటారు. ఉన్నత విద్య కొరకు విదేశీయానానికి శ్రమ చేస్తారు. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువ, విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి. గృహ వాహన రిపేర్ల కొరకు శ్రద్ధ. వారం మధ్యలో పందెములు, బెట్టింగులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. స్త్రీ సంతానం అభివృద్ధి. పురుష సంతానం మీద , వారి అలవాట్లు, అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టిని కేటాయించాలి. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. వారం చివరిలో పనులు కొంతవరకు ముందు కదులుతాయి. కుటుంబ సభ్యుల, భాగస్వామి సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. నూతన పరిచయాలు,వ్యాపారం విస్తరణ, వీలైనంతవరకు స్త్రీలతో అభిప్రాయ బేధాలకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, మరిన్ని మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శన మంచిది


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అధిక ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, వృత్తిపరమైన చికాకులు, వారసత్వ ఆస్తుల గురించి చర్చలు, ముఖ్యముగా కుటుంబ వ్యవహారాలు ఊహించని ఇబ్బందులను పెంచుతాయి. తలనొప్పి, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, నిర్లక్ష్యం చేయరాదు. దగ్గర ప్రయాణాలకు అవకాశం, ముఖ్య వ్యవహారాలలో శక్తి సామర్ధ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వారం మధ్యలో డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనమునకు సంబంధించిన ఇబ్బందులు, అధికం. గృహ వాతావరణం అసౌకర్యం, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా సమయాలు అనవసర గందరగోళం. ఆరోగ్య ఆహార శ్రద్ధ చాలా అవసరం. వారం చివరిలోఆరోగ్య, వాహన విషయాలు జాగ్రత్త.జ్ఞాపక శక్తి తగ్గుతుంది, వృత్తిపరంగా అనవసర వ్యక్తుల జోక్యం చికాకును సృష్టిస్తుంది. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.  మరిన్ని మంచి ఫలితాలు సత్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


వారం ప్రారంభంలో  ఫలితాంశములను గమనించగా వ్యాపార వ్యవహారములలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి, ఆర్థిక విషయాలలో ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు కుటుంబ వ్యవహారాల్లో చికాకులను పెంచుతాయి. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది నాయకత్వ లక్షణాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహ వాహనములకు, రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారాంతంలోకుటుంబ స్త్రీల సహకారాన్ని పొందుతారు.విందు వినోదాల్లో పాల్గొంటారు, మానసిక ప్రశాంతత, పూర్వ రుణములు చెల్లిస్తారు. లాభపరమైన ఆలోచనలు చేస్తారు.  మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన మంచిది 


 


(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa