భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 19న జరగాల్సిన వీరి పెళ్లి, రింకూ సింగ్ క్రికెట్ సిరీస్‌ల కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిందని సమాచారం. వీరి నిశ్చితార్థం ఈ నెల ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.ఒక ప్రముఖ వార్తాపత్రిక కథనం ప్రకారం, రింకూ సింగ్ రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండనున్నాడు. ఈ కారణంగా వివాహాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో రింకూ సింగ్ భారత జట్టు తరఫున ఆడాల్సి ఉండటంతో, ఇరు కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. "2025 నవంబర్ 19న రింకూ, ప్రియాల వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అయితే, భారత క్రికెట్ జట్టుతో రింకూకు ఉన్న కమిట్‌మెంట్ల కారణంగా వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది" అని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.వివాహాన్ని 2026 ఫిబ్రవరి నెలాఖరులో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఇందుకుగాను హోటల్‌ను కూడా బుక్ చేసినట్లు తెలిసింది. అయితే, కచ్చితమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తారని ఆ నివేదిక వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa