భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రక అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల పాటు ఉండిన తర్వాత, ఆయన యాక్సియోమ్-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా తన ముగ్గురు సహ వ్యోమగాములతో కలిసి భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3:01 గంటలకు వారు పసిఫిక్ మహాసముద్రంలోని కాలిఫోర్నియా తీరంలో ల్యాండయ్యారు.
అంతరిక్షంలో 18 రోజుల పాటు శుభాంశు శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)తో సహకారంతో జరిగిన ఈ ప్రయాణంలో, శుభాంశు జీవశాస్త్రం, ద్రవ్యగతిశాస్త్రం వంటి అనేక ప్రయోగాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రయాణం భారత అంతరిక్ష చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది.
శుభాంశు శుక్లా పునరాగమనంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని సహా అనేక ప్రముఖులు ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ఈ ప్రయాణం భారత యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. శుభాంశు విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో మరో ఘనతను చాటుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa