ఔషధ గుణాలు పుష్కలంగా దాగి ఉన్న యాలకులు... ఆరోగ్యానికి అద్భుతమైన వరం!చిన్నదైనా చిల్లకాయ అయినా... యాలకులలోని శక్తి మాత్రం గొప్పది. ఈ మసాలా దినుసులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో, పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగల శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.యాలకుల్లో విటమిన్ C, విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు, కొద్దిపాటి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. అందువల్ల ఇవి వంటల్లో మాత్రమే కాదు, వైద్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి.ఆహారానికి రుచి, సువాసన ఇచ్చే యాలకులు టీతో పాటు పలు పానీయాల్లో వినియోగించబడతాయి. కానీ వాటి అసలు విలువ ఆరోగ్య ప్రయోజనాల్లో ఉంది.
యాలకుల ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:
* గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి:రోజూ రెండు నుంచి మూడు యాలకులు తినడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
* జీర్ణక్రియ మెరుగవుతుంది:ఉబ్బసం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో యాలకులు సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి.
*శృంగార శక్తిని పెంచుతాయి:యాలకులు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా పనిచేస్తాయి. శరీర బలహీనతను తగ్గించడమే కాక, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దోహదపడతాయి.
*బరువు తగ్గే దిశగా సహాయపడతాయి:యాలకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు, శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి. ఫ్యాటి లివర్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
* శరీర డిటాక్స్‌కు తోడ్పడతాయి:యాలకులు శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్‌లు) బయటకు పంపుతాయి. కిడ్నీ, మూత్రాశయ రోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటిని సహజమైన డిటాక్సిఫైయర్‌గా భావించవచ్చు.
* నోటి దుర్వాసనను దూరం చేస్తాయి:యాలకులు సహజ మౌత్ ఫ్రెషెనర్. నోటి శుద్ధికి తోడ్పడడంతో పాటు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
యాలకులు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుత ఔషధంలాంటివి. వీటిని వాడటం వల్ల శరీరానికి తక్షణ, దీర్ఘకాలిక లాభాలు దక్కుతాయి. రోజూ 2–3 యాలకులు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa