మీరు పెట్టుబడులు పెడుతున్నారా.. ఇందుకోసం ఏది ఎంచుకుంటున్నారు. పెట్టుబడుల కోసం మనకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో రిస్క్ లేని వాటి విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసే పోస్టాఫీస్ పథకాలు, ఆర్బీఐ బాండ్లు, ఎల్ఐసీ స్కీమ్స్ ఇలా చాలానే ఉంటాయి. వీటిల్లో మీ పెట్టుబడులపై గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ నిర్దిష్ట కాల పరిమితులపై మీ పెట్టుబడికి అనుగుణంగా రాబడి ఉంటుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో రిస్క్ ఉన్న పెట్టుబడులు కూడా ఉంటాయి. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడి ఆశించవచ్చని చెబుతుంటారు నిపుణులు.
ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన 12 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ 1990ల్లో లాంఛ్ అయిన మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ 288 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో 12 ఫండ్స్ మాత్రం లాంగ్ రన్‌లో కాసుల పంట పండించాయి. రూ. 10 వేల సిప్‌ను ఏకంగా రూ. 26 కోట్ల వరకు చేయడం విశేషం. అంటే సిప్ పెట్టుబడులతో కోట్లు వచ్చాయన్నమాట. వీటిల్లో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.
నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ (గతంలో ఇదే నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్) 1995 అక్టోబరులో లాంఛ్ అవగా.. ఇక్కడ రూ. 10 వేల చొప్పున అప్పటి నుంచి సిప్ చేసిన వారికి రూ. 26.20 కోట్లు వచ్చాయి. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 22.74 శాతం చొప్పున రిటర్న్స్ వచ్చాయి. తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (1993) 20.38 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ రూ. 10 వేల సిప్ రూ. 23 కోట్లు అయింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ (1996) రూ. 10 వేల సిప్‌తో రూ. 21.68 కోట్లు అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (1995) చూస్తే సగటున 21 శాతం చొప్పున రిటర్న్స్ అందించగా రూ. 10 వేల సిప్ కాస్తా రూ. 21.57 కోట్లు అయింది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (1994) కూడా రూ. 10 వేల సిప్ చేసిన వారికి రూ. 16 కోట్లు అందించింది.
ఎస్బీఐ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ (1993) నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ చేసిన వారికి రూ. 14.95 కోట్లు అందించింది. ఫ్రాంక్లిన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ (1993) రూ. 10 వేల సిప్‌ను రూ. 13 కోట్లు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ వాల్యూ ఫండ్ (1994) 10 వేల చొప్పున సిప్ చేసిన వారికి రూ. 11 కోట్లకుపైగా అందించింది. నిప్పన్ ఇండియా విజన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (1995) 10 వేల సిప్‌ను రూ. 11 కోట్లు చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ (1994) 17.4 శాతం చొప్పున రిటర్న్స్ అందించగా రూ. 10 వేల సిప్‌ను రూ. 10.50 కోట్లు చేసింది. ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (1993) రూ. 10 వేల సిప్‌తో రూ. 10 కోట్లకుపైగా అందించింది. టాటా మిడ్ క్యాప్ ఫండ్ (1994) కూడా సరిగ్గా రూ. 10 కోట్లు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa