ఆసియా కప్-2025 (Asia Cup) ఈసారి అభిమానులకు మినీ క్రికెట్ విందు అందించనుంది. పొట్టి ఫార్మాట్లో జరగబోయే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న శ్రీకారం చుడనుంది.ఆతిథ్యం భారత్‌కే దక్కినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న పూర్వ ఒప్పందం కారణంగా ఈ టోర్నీ తటస్థ వేదిక యూఏఈలో జరుగనుంది.
*గ్రూప్ లైన్‌అప్ : గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’లో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడనున్నాయి. చివరిసారి 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ టోర్నీలో భారత జట్టు సూపర్ ఫోర్ దశలోనే పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి బయటపడింది.
*ప్రపంచకప్‌లో టీమిండియా సత్తా:ఆ చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి, రోహిత్ సేన టీ20 వరల్డ్‌కప్-2024లో అద్భుత ప్రదర్శన కనబరచి ట్రోఫీని గెలుచుకుంది. ఆసాంతం అజేయంగా నిలిచిన భారత్ టైటిల్ సాధించింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే అమెరికా చేతిలో ఓడి నిష్క్రమించింది.
*చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్:2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో కూడా భారత్ విజేతగా నిలిచింది. అనంతరం వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం భారత్ టైటిల్ గెలిచి దూకుడు చూపింది. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే అవుట్ కాగా.. శ్రీలంక అర్హత పొందలేకపోయింది. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.
*అఫ్గనిస్తాన్ రైజింగ్ టీమ్ :ఇటీవల అఫ్గనిస్తాన్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు ఇస్తోంది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్ చేరింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా తొలిసారి పాకిస్తాన్‌పై గెలిచి సెన్సేషన్ సృష్టించింది. చివర్లో ఒత్తిడిలో ఓడి బయటపడినా.. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. ఆ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించి తన శక్తిని చాటింది.
*మదన్ లాల్ విశ్లేషణ:భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ మాట్లాడుతూ“టీమిండియా ఈ టోర్నీలో ఫేవరెట్ జట్టే. కానీ టీ20 ఫార్మాట్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల ప్రదర్శనలతో పాటు అఫ్గనిస్తాన్ ప్రత్యేకంగా గమనించాల్సిన జట్టు. వాళ్ల ఆత్మవిశ్వాసం, ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉన్నాయి. కచ్చితంగా గట్టి పోటీ ఇస్తారు” అని అన్నారు.ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్–హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమై, సెప్టెంబరు 28న ఫైనల్‌తో ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa