కడప చిన్న చౌక్ ప్రాంతంలోని సంజన్న కూడలి సమీపంలో గురువారం ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనదారులు రాకపోకలు సాగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్రేన్ సహాయంతో వృక్షాన్ని తొలగించే పనులు చేపట్టారు. అధికారులు ఒకవైపు రాకపోకలను మాత్రమే అనుమతించారు. ప్రమాదకరంగా మారిన వృక్షాలను గుర్తించి తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa