అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) తగ్గించింది. గతేడాది డిసెంబర్ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో స్వల్పకాలిక వడ్డీ రేటు 4.3 శాతం నుంచి సుమారు 4.1 శాతానికి దిగివచ్చింది. ఈ ఏడాది మరో రెండుసార్లు, 2026లో ఒకసారి వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది.గతంలో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై, ఆయన విధానాలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయంపై ట్రంప్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa