హిందూ పురాణాల ప్రకారం.. దసరా రోజున పాలపిట్టను చూడటం విజయానికి శుభ సూచకంగా భావిస్తారు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం ముగించి తిరిగి వస్తున్నప్పుడు పాలపిట్ట కనిపించిందని, ఆ తర్వాత వారు విజయాలు సాధించారని మహాభారతం చెబుతోంది. త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి బయలుదేరే ముందు పాలపిట్టను చూశారని, అది శుభసూచకంగా భావించి రావణాసురుడిని సంహరించారని నమ్మకం. ఈ నేపథ్యంలో, దసరా రోజున పాలపిట్ట దర్శనం అమ్మవారి అనుగ్రహాన్ని, దోష నివారణను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa