ఉగ్రవాదమే దేశ విధానంగా కొనసాగుతోంది పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్‌తో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి.. భారత్ గట్టి హెచ్చరిక చేసినా.. దాన్ని పాక్ పెడచెవిన పెడుతోంది. మళ్లీ ఉక్ర మూలకను కూడగట్టి భారత్‌పైకి ఉసిగొల్పడానికి.. ముఖ్యంగా కాశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పలు ఉగ్రవాద సంస్థలను కూటమిగా ఏర్పాటు చేస్తోందని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెలువరించింది. ఈ తతంగాన్నంతా పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. నిధులు సమకూర్చుతోందని ఆ కథనంలో పేర్కొంది.
ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని రహస్య పత్రాలను తాము సేకరించినట్లు ఆ కథనం వెల్లడించింది. దాని ప్రకారం.. పాక్ టెర్రర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింతగా విస్తరిస్తోంది. ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా (LeT), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP).. ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ ఆలోచన ఆచరణలోకి తీసుకొచ్చి.. నిధులు సమకూర్చుతోంది పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ. ఉగ్రవాదాన్నే దేశ విధానంగా, తమ ఆయుధాంగా వాడుకుంటూ.. బలూచిస్తాన్‌తో పాటు అఫ్గానిస్థాన్, భారత్‌పై దృష్టి సారిస్తోంది.
ఎందుకు ఈ ఉగ్ర కూటమి?
తమకు సొంత దేశం కావాలని బలూచిస్తాన్ ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ సైన్యానికి కునుకు లేకుండా చేస్తున్నారు బలూచ్ రెబల్స్. బలూచిస్థాన్ జాతీయవాదులను అణిచివేయడానికి.. పాక్ మిలటరీ నియంత, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉగ్రవాదులను రంగంలోకి దింపుతున్నారు. అందులో భాగంగా లష్కరే తోయిబా, ISKPని ఒకటి చేసి.. బలూచ్ రెబల్స్‌పై ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచించారు. అంతేకాకుండా అఫ్గానిస్తాన్‌లోని పాక్ వ్యతిరేక శక్తులను అంతమొందించడానికి కూడా ఈ ఉగ్ర కూటమిని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ సిద్ధపడిందట.
కాశ్మీర్‌లోనూ ఈ ఉగ్రకూటమి అలజడులు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ISKP ప్రచార పత్రిక 'యల్గార్'.. ఇటీవలి విడుదల సంచికల్లో.. కాశ్మీర్‌లో ఉగ్రవాద విస్తరణ గురించి ప్రణాళికలు ప్రస్తావించినట్లు సమాచారం. ఇది దక్షిణాసియాను అస్థిరపరిచేందుకు రూపొందించబడిన భయంకరమైన కొత్త దశ ఉగ్రవాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్ర కూటమి ఏర్పడినట్లు వస్తున్న వార్తలకు.. ఓ ఫొటో మరింత బలం చేకూర్చింది. ISKP బలూచిస్తాన్ సమన్వయకర్త మీర్ షఫీక్ మెంగల్.. లష్కరే తోయిబా శక్తివంతమైన నజీమ్-ఎ-అలా రాణా మొహమ్మద్ అష్ఫాక్‌కు పిస్టల్‌ను అందజేసినట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు ఉగ్ర సంస్థల మధ్య అధికారికంగా సహాయ సహకారాలు ప్రారంభమైనట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
బలూచిస్తాన్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడే షఫీక్ మెంగల్. చాలా కాలంగా ఇతడు ఐఎస్ఐకి అసెట్‌గా ఉన్నాడు. బలూచ్ జాతీయవాదులను చంపడమే లక్ష్యంగా ప్రైవేటు గ్రూప్‌ను నుడుపుతున్నాడు. 2015 నుంచి ISKPకి నిధులు, ఆయుధాలు, రహస్య ఇళ్లు సమకూరుస్తున్నాడు మెంగల్. బలూచ్ వేర్పాటువాదులను అణచివేయడానికి మస్తుంగ్, ఖుజ్దార్ ప్రాంతాల్లో ISKP బేస్‌లను ఏర్పాటు చేశాడు. అఫ్గాన్‌పై కూడా దాడులకు తెగబడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa