మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుందనుకుంటాం. కానీ, తినే ఆహారం కూడా సరైన సమయంలో తినడం మంచిది. మన టైమ్ కానీ, టైమ్‌లో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా అది అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. అందుకే, సరైన టైమ్‌లో సరైన ఫుడ్ తినాలి. ఇందులో భాగంగా, లేట్ నైట్ డిన్నర్ అసలే చేయొద్దొన చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. డిన్నర్ ఎప్పుడైనా సరే 7నుంచి 8 గంటల మధ్యలో చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలా కాదంటే గుండె సమస్యల్ని కోరి మరీ తెచ్చుకున్నవారవుతారని సూచిస్తున్నారు.
డిన్నర్ ఎర్లీగా చేయడం చాలా మంచిది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారడమే కాకుండా చాలా సమస్యల్ని దూరం చేసుకున్నవారవుతాం. ముఖ్యంగా రాత్రి 7 దాటాక కొంతమంది ఫుడ్ తీసుకుంటారు. అది ఓ గంట ఇటు ఇటు అయితే పర్లేదు. మరీ 9 గంటలకి అలా తీసుకుంటే స్ట్రోక్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎప్పుడైతే డిన్నర్ మనం 7 తర్వాత తింటామో అప్పుడు 28 శాతం గుండె సమస్యల నుంచి తప్పించుకున్నవారవుతామని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా డిన్నర్‌ని త్వరగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, నిద్ర సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. అంతేకాదు, బరువుని కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చని చెబుతున్నారు. అసలు డిన్నర్ రాత్రి 7 గంటలకి ఫినిష్ చేస్తే ఎన్నో లాభాలున్నాయని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
జీర్ణసమస్యలు దూరం
త్వరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు రావని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. సూర్యాస్తమయం సాధారణంగా అగ్ని తగ్గుతుంది. కాబట్టి, ఈ లోపే తింటే త్వరగా జీర్ణమవుతుంది. దీంతో బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు రావు. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారు కచ్చితంగా 7 గంటలకి తినడం అలవాటు చేసుకుంటే త్వరలోనే ఆ సమస్యకి చెక్ పెట్టినవారవుతారని సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలు తగ్గి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుందని త్వరగా తినడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్
నిద్ర సమస్యలు దూరం
అదే విధంగా, ఎవరైతే పడుకోవడానికి కనీసం 3 నుంచి 4 గంటల ముందుగా డిన్నర్‌ని కంప్లీట్ చేస్తారో వారికి నిద్ర సమస్యలు దూరమై హ్యాపీగా నిద్రపడుతుందని చెబుతున్నారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో గ్యాస్ పట్టేయడం, అసిడిటీ ఉండవు. కడుపు తేలిగ్గా మారి మంచి నిద్ర మీ సొంతమవుతుందని చెబుతున్నారు. రెగ్యులర్‌గా స్లీప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు డిన్నర్‌ని ఎర్లీగా కంప్లీట్ చేయండి.
డయాబెటిస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, అధిక బరువు తగ్గడం
ఇంకేం కావాలి చెప్పండి. త్వరగా డిన్నర్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి అధికబరువు తగ్గుతారని, దీని కారణంగా ఆటోమేటిగ్గా హైపర్ టెన్షన్, షుగర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఎవరైతే ముందునుంచీ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారో వారు త్వరగా డిన్నర్‌ని కంప్లీట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. దీని వల్ల చాలా వరకూ ప్రమాదకరమైన సమస్యల రాకుండా ముందునుంచే జాగ్రత్తపడొచ్చొని చెబుతున్నారు.
మానసిక సమస్యలు దూరం
ఎవరైతే ముందుగా డిన్నర్ చేస్తారో వారి బాడీ రిలాక్స్‌గా లైట్‌గా ఫీల్ అవుతుందని దీంతో ఒత్తిడి తగ్గి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. మెంటల్లీ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటారో ఆటోమేటిగ్గా హెల్దీగా కూడా మారతారు. కాబట్టి, త్వరగా డిన్నర్ చేయడం అలవాటు చేసుకోండి.
డిన్నర్ త్వరగా చేయడం వల్ల కలిగే లాభాలేంటంటే
ఉదయాన్నే ఎనర్జీగా
రెగ్యులర్‌గా రాత్రుళ్లు లేట్‌గా తినేవారికి ఉదయాన్నే బద్ధకంగా అనిపించడం జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆలస్యంగా తీసుకున్న ఆహారం లేట్‌గా జీర్ణమవ్వడం దీంతో సరిగ్గా మలవిసర్జన చేయకపోవడం వీటన్నింటి కారణంగా బాడీ మొత్తం అలసటగా ఉంటుంది. అలా కాకుండా త్వరగా డిన్నర్ చేస్తే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై ఉదయాన్నే మలవిసర్జన సజావుగా జరుగుతుంది. దీంతో సరైన విధంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa