AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం కుండపోత వర్షాలు కురిశాయి. అన్నమయ్య, నెల్లూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. 26న అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్సుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa