హైపర్ కొలెస్టెరోలేమియా అని పిలిచే హై కొలెస్ట్రాల్ రక్తంలో అధిక స్థాయిలో కొలెస్ట్రాల్‌ని సూచిస్తుంది. ఇది ధమనుల్లో ఫలకం ఏర్పడేలా చేస్తుంది. దీంతో ధమనుల్లో రక్త ప్రవాహం అడ్డుకుంటుంది. గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె సమస్యలు హై కొలెస్ట్రాల్ కారణమవుతుంది. దీంతోపాటు హై బ్లడ్ షుగర్, హైపర్గ్లైసీమియా రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ ఉండడం వల్ల వచ్చే సమస్య. ఇది తరచుగా ఇన్సులిన్ తగినంతగా లేకపోవడం వల్ల వస్తుంది. దీని కారణంగా దాహం పెరగడం, ఎక్కువగా మూత్ర విసర్జన, అలసట, చికిత్స చేయకపోతే, గుండె, కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే, ఇన్ని ప్రమాదాలకి కారణమయ్యే హై కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసేందుకు జామాకులు బాగా హెల్ప్ చేస్తాయి. ఈ సమస్యలననింటినీ దూరం చేసేందుకు జామాకుల్ని ఎలా వాడాలో తెలుసుకోండి.
జామాకులు
జామాకులు సాంప్రదాయ వైద్యంలో ఎన్నో విధాలుగా ఉపయోగడపతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ సపోర్ట్ చేయడం దగ్గర్నుంచీ జీర్ణక్రియ మెరుగ్గా మారడం వరకూ ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని మనం టీలా చేసి తీసుకోవచ్చు. నేరుగా నమిలి తినొచ్చు. ఇందులో విటమిన్ సి, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని మనం టీలా చేసుకుని తాగడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. వీటితో టీని ఎలా చేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
4 జామాకులు
1 గ్లాసు నీరు
ఎలా తయారుచేయాలి?
ముందుగా జామాకుల్ని శుభ్రంగా కడగాలి. ఓ గ్లాసు నీటిలో జామాకుల్ని వేయండి. కనీసం 10 నిమిషాల పాటు మరిగించండి. ఇది మంచి డీకాషన్లా తయారవుతుంది. ఇది చల్లారక అందులో మీకు నచ్చితే కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడపున తాగాలి. దీని వల్ల చాలా ఎన్నో సమస్యల్ని దూరం చేయొచ్చు. ఉదయాన్నే టీ, కాఫీలు తాగే వారు వాటి బదులు ఇలాంటి ఓ హెర్బల్ టీతో తయారుచేసి తాగితే ఎన్నో మరెన్నో లాభాలుంటాయి.
హై కొలెస్ట్రాల్ తగ్గేందుకు
జామాకులు హై కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. దీనికి కారణం జామాకుల్లోని సోల్యూబుల్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, క్వార్సెటిన్ వంటి గుణాలు. జామాకుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా, దీనిని తీసుకోవడం వల్ల హైబీపి కూడా తగ్గుతుంది. ఈ రెండు అతి పెద్ద సమస్యలు దూరం కావడడంతో వీటి కారణంగా వచ్చే మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దూరమవుతాయి.
బ్లడ్ షుగర్ తగ్గేందుకు
జామాకుల్లో తాగడం వల్ల హై బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. దీనికోసం జామాకుల్లోని ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ వంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఆహారం తిన్న తర్వాత షుగర్ అబ్జార్బ్ కాకుండా చేస్తాయి. దీనిని టీలా చేసుకుని తాగితే మంచి హెర్బల్ టీలా పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. దీని వల్ల స్కిన్ హెల్త్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
కంటి ఆరోగ్యం
జామాకుల్లో ఫ్లేవనాయిడ్స్, టాన్సిన్స్ కారణంగా రెటీనా హెల్త్ బాగుంటుంది. ఇందులోని కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీనికి కారణం ఇందులోని ఫ్లేవనాయిడ్స్, టాన్సిన్స్ ఫ్రీ రాడికల్స్‌ని వల్ల వచ్చే సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు కళ్ళు డ్రైగా, వయసు తాలుకూ వచ్చే కంటి దృష్టి సమస్యలు తగ్గుతాయి.
దంత ఆరోగ్యం
అలానే కాకుండా లేత జామాకుల్ని నమిలితే చిగుళ్ల వాపు, పంటినొప్పి, దుర్వాసనలు తగ్గుతాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. జామాకుల్ని పేస్టులా చేసి మనం ప్యాక్ వేసినప్పుడు గాలు తగ్గుతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఇతర లాభాలు
జామాకుల్ని తీసుకోవడం వల్ల ఈ లాభాలే కాకుండా అలర్జీలు తగ్గుతాయి. దగ్గు నుండి రిలాక్స్ అవుతారు.
వాతావరణంలో తేమ పెరగడం వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల్ని కూడా ఈ జామాకుల టీ దూరం చేస్తుంది.
సమస్య ఉన్నప్పుడు మెడిసిన్ వాడకుండానే ఇలాంటి మూలికల్ని తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
మన చుట్టూ ఉండే జామాకుల్ని తీసుకోవడం ఎన్నో లాభాలు ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa