సంతానలేమి సమస్య దూరం కావాలంటే సరైన విధంగా ప్రయత్నించాలి. మనం తీసుకునే డైట్ నుంచి ఫాలో అయ్యే డే రొటీన్ వరకూ ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, పోషకాహారం తీసుకుంటే సరైన వర్కౌట్స్ చేయాలి. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, సరైన జగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. కొన్ని ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ చేంజెస్ చేస్తే సహజనంగానే సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో మీకు సమస్యలు ఉంటే ముందుగా ఇవి ట్రై చేసి చూడండి. ఇవి మనం రోజు ఫాలో అవ్వాల్సిన రొటీన్‌కి దగ్గరగానే ఉంటాయి. మరి ఆ జాగ్రత్తలు ఏంటంటే
మెనుస్ట్రువల్ సైకిల్‌ని ట్రాక్ చేయడం
ముందుగా మీ పీరియడ్స్‌ని ట్రాక్ చేయాలి. మీకు ఏ రోజు పీరియడ్ స్టార్ట్ అయింది. నెక్ట్స్ పీరియడ్ ఏ టైమ్‌కి వస్తుందనేది తెలుసుకోవాలి. సాధారణంగా అందరికీ 28 రోజులకి ఓ సారి పీరియడ్ వస్తుంది. దీనిని బట్టి మనం ఓవులేషన్ టైమ్‌ని తెలుసుకోవచ్చు. మీకు పీరియడ్ స్టార్ట్ అయినప్పట్నుంచీ నెక్ట్ పీరియడ్ వచ్చే ముందుకి 14 రోజు మీకు ఓవులేషన్ పీరియడ్. ఆ టైమ్‌లో భార్యాభర్త దగ్గరైతే నేచురల్‌గానే ప్రెగ్నెన్సీ వస్తుంది.
ఏ రోజుల్లో కలవాలి
మీరు మీ పార్టనర్‌తో ఓవులేషన్ టైమ్‌లో కలిస్తే సరైన రిజల్ట్ ఉంటుంది. పీరియడ్ స్టార్ట్ అయిన 10 రోజు నుంచి 17 రోజు వరకూ రెండురోజులకి ఓ సారి కలవాలి. లేదా 12వ రోజు నుంచి 16వ రోజు వరకూ రెగ్యులర్‌గా కలిస్తే మంచిది. ఈ టైమ్‌లో 2 రోజులకి మించి భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉండొద్దు. దీని వల్ల అదే టైమ్‌లో ఎగ్ రిలీజ్ అవుతుంది. స్పెర్మ్ ఎగ్‌తో కలిసి ఫలదీకరణం జరుగుతుంది. దీంతో రిజల్ట్ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉంది.
ఓవులేషన్ టైమ్ గురించి ఎలా తెలుసుకోవాలి.
ఓవులేషన్‌ని టైమ్ గురించి కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఎలా గుర్తించాలని. కానీ, కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకి కొద్దిగా పొత్తికడుపులో నొప్పి, క్రాంప్స్‌లా అనిపిస్తుంది.
అదే విధంగా కోరికలు కాస్తా ఎక్కువగా ఉంటాయి.
బాడీ టెంపరేచర్ కాస్తా పెరుగుతుంది.
మీరు స్ట్రిప్స్ వాడితే మరింత ఎఫెక్టివ్‌గా తెలుస్తుంది.
లేదంటే మీరు ఫోన్‌లో కొన్ని ఆప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని వాడొచ్చు.
పీరియడ్స్‌ని బట్టి ఎలా కలవాలి
కొంతమందికి 26 రోజులకి ఓ సారి పీరియడ్స్ వస్తాయి, 28 రోజులకి ఓ సారి, 30, 32 ఇలా రోజులని బట్టి పీరియడ్స్ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే
26 రోజులకి ఓ సారి పీరియడ్ వచ్చేవారు 8వ రోజు నుంచి 13వ రోజు వరకూ ట్రై చేయొచ్చు.
28 రోజులకి ఓ సారి పీరియడ్స్ వచ్చే వారు 10వ రోజు నుంచి 15వ రోజువరకి ట్రై చేయొచ్చు.
30 రోజులకి ఓ సారి పీరియడ్స్ వచ్చేవారు 12వ రోజు నుంచి 17 వ రోజు వరకూ ట్రై చేయొచ్చు.
32 రోజులకి ఓ సారి పీరియడ్ వచ్చేవారు 14వ రోజు నుంచి 19వ రోజు వరకూ ట్రై చేయొచ్చు.
ప్రెగ్నెన్సీ అయ్యేందుకు ఏ టిప్స్ పాలో అవ్వాలి.
కొన్ని యోగాసనాలు
బటర్‌ఫ్లై, బ్రిడ్జ్ పోజ్, లెగ్స్ అప్ ద వాల్, చైల్డ్ పోజ్ వంటివి చేస్తే ఫెర్టిలిటీ అవకాశాలు పెరుగుతాయి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీని వల్ల ఓవులేషన్ డిలే అవుతుంది. కాబట్టి, ఒత్తిడికి దూరంగా ఉండాలి.
జింక్, ఫోలేట్, ఐరన్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ రోజూ తీసుకోవాలి.
రోజుకి 3 లీటర్ల నీరు తాగాలి.
7 నుంచి 8 గంటల నిద్ర సరిగ్గా ఉండాలి.
అశ్వగంధ
అదే విధంగా, కొన్ని మూలికల్ని తీసుకున్నా సమస్య తగ్గుతుంది.
ఆడవారు :
అశోక, లోధ్రా, గోక్షూర వంటి మూలికలు తీసుకోవాలి.
మగవారు :
అశ్వగంధ, షిలాజిత్, సఫేద్ ముస్లి, గోక్షూర తీసుకోవాలి.
అయితే, ఇందులోనూ మంచి నాణ్యమైన మూలికలు తీసుకోవాలి.
వీటితో పాటు
స్మోకింగ్, డ్రింకింగ్, కెఫిన్‌కి దూరంగా ఉండాలి.
జంక్ ఫుడ్ తీసుకోవద్దు
సాత్విక ఆహారమే తీసుకోవాలి.
రోజూ కనీసం 8వేల అడుగులు నడవాలి.
20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి.
యోగా, మెడిటేషన్ చేయాలి.
ఓపిక చాలా అవసరం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa