ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ మూన్ సందడి: ఆకాశంలో కనువిందు చేసిన చంద్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 08:12 PM

ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నవంబర్ 5వ తేదీ సాయంత్రం ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే మరింత పెద్దగా, మరింత వెలుగులీనుతూ కనువిందు చేయనున్నాడు.బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ఈ ప్రత్యేక పౌర్ణమిని ‘బీవర్ సూపర్ మూన్’ అని పిలుస్తారు.పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీపానికి చేరుకోవడం వలన ఈ సూపర్ మూన్ దర్శనం సాధ్యమవుతుంది.ఈ సందర్భంలో చంద్రుడు మామూలు రోజుల కంటే సుమారు 13 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఆకాశంలో మెరిసే ఈ ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించే అవకాశం మిస్ కావొద్దు! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa