మన రోజువారీ వంటకాల్లో టమాటా కీలకమైనది. అయితే టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ ఉంది. నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారు సాధారణ మోతాదులో టమాటాలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 100 గ్రాముల టమాటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుందన్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి నీటి కొరత, జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa