ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, ముంబై విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి ఈ మెయిల్ అందింది. దీంతో ఐదు విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు బస్టాప్‌లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్‌లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ప్రయాణికులను కూడా ఖాళీ చేయించి తనిఖీలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa