బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ మజుందార్ షా ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రముఖులు హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో ఆదివారం ఈ వేడుక జరిగింది. కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, ఎంపీ సుధామూర్తి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో సుధామూర్తి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa