జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించారు. అడవిలో జరుగుతున్న దురాగతాలను ఈ డాక్యుమెంటరీ సమగ్రంగా వివరించిందని పేర్కొన్నారు. శేషాచలం అడవిని ఎలా నాశనం చేశారో అసాధారణంగా వివరించిందని, ఎర్రచందనం చెట్లను నరికి, అక్రమంగా రవాణా చేయడాన్ని ఎత్తి చూపిందని పేర్కొన్నారు. ఎర్రచందనం మాఫియా వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్‌పిన్‌లను, జరిగిన క్రూరమైన హింసను, ఈ ప్రక్రియలో మనం కోల్పోయిన అటవీ అమరవీరులను ఈ డాక్యుమెంటరీ బహిర్గతం చేసింది. రాజకీయ ముసుగులు వేసుకుని ఎర్రచందనం నెట్‌వర్క్‌లో దాక్కున్న నేరస్థులు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి' అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa