ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామని వివరించారు. ఇవాళ(శనివారం) సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..... డేటా సెంటర్ ఇప్పుడు సాకారమైందని చెప్పుకొచ్చారు. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించి విద్యుత్ తయారు చేయటం ఓ సవాల్ అని ఉద్ఘాటించారు. అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశమని తెలిపారు. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని పేర్కొన్నారు. ఆ వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa