ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి, ఆర్జేడీకి ఓట్లు సమానంగా వచ్చినా సీట్లలో భారీ తేడా

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:17 PM

గత ఎన్నికలతో పోల్చితే.. ఓట్ల శాతం స్వల్పంగానే తగ్గినా.. సీట్ల సంఖ్య పరంగా చూస్తే.. భారీ తేడా వచ్చింది. అదే సమయంలో ఆర్జేడీ కంటే తక్కువ ఓట్లు దక్కించుకున్న బీజేపీ 89 సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఓట్ల శాతం పరంగా చూస్తే మాత్రం ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2020లో ఎన్డీఏ కూటమికి 37.26 శాతం ఓట్లతో 125 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహాఘట్‌బంధన్‌ 37.23 శాతం ఓట్లతో 110 స్థానాలు దక్కించుకుంది. కానీ ఈసారి 35 సీట్లకు దారుణ పతనం పొందింది.


బీజేపీ


ఈ ఎన్నికల్లో బీజేపీకి 20.8 శాతం ఓట్లతో 89 సీట్లు వచ్చాయి. అదే ఓట్ల సంఖ్య పరంగా చూస్తే.. కోటీ 19,920 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమిలో కీలక పార్టీగా ఉన్న జేడీయూకు 19.25 శాతం ఓట్లతో 96,05,750 ఓట్లు వచ్చాయి. ఇక సీట్లు 85 సాధించింది. 2020లో కేవలం 0.03 శాతం ఓట్ల తేడాతో ఎన్డీఏ కూటమి అతి కష్టం మీద గెలిచింది. ఈసారి 46.6 శాతం ఓట్లతో దాదాపు మూడు వంతుల మెజారిటీ (202 సీట్లు) సాధించింది.


ఆర్జేడీ


అదే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు రాగా.. 1,14,77000 ఓట్లు వచ్చాయి. కానీ సీట్ల సంఖ్య మాత్రం 25కే పరిమితం అయింది. 2020 ఎన్నికల్లోనూ దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆర్జేడీ దక్కించుకుంది. కానీ ఈసారి ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేయగా.. కేవలం 25 సీట్లకే పరిమితం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ 144 స్థానాల్లో పోటీచేసి.. 75 సీట్లను కైవసం చేసుకుంది. ఆ సమయంలో బిహార్‌లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఓట్ల పరంగా కూడా ఆ సమయంలో ఆర్జేడీ టాప్‌లో నిలిచింది. కానీ ఇప్పుడు 75 నుంచి సీట్ల సంఖ్య 25కు తగ్గిపోవడం ఆర్జేడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీటికితోడు ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేయగా.. బీజేపీ, జేడీయూలు కేవలం చెరో 101 స్థానాల్లో మాత్రమే పోటీ చేశాయి. దీనివల్ల బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయడంతో.. ఆ పార్టీల కంటే ఓట్ల శాతం సర్వసాధారణంగానే పెరుగుతుంది.


కాంగ్రెస్


కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 8.71 శాతం ఓట్లతో కేవలం 3 సీట్లకు పరిమితం అయింది. ఓట్ల సంఖ్య విషయానికి వస్తే 43,46,290 వచ్చాయి.


ఎల్జేపీ-ఆర్‌వీ


ఎన్డీఏలోని మరో కీలక పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్‌కు 4.97 ఓట్ల శాతంతో 19 సీట్లు సాధించింది. ఇక మొత్తం ఆ పార్టీకి 24,80,030 ఓట్లు వచ్చాయి.


మరోవైపు.. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ 37.9 శాతం ఓట్ల శాతం సాధించింది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. దాదాపుగా అంతే స్థిరంగా ఉంది. అయితే ఎన్డీఏకు 47.8 శాతం ఓట్లు వచ్చాయి. గతం కంటే 9 శాతానికి పైగా ఓట్లు పెరిగాయి. దీనికి కారణం జేడీయూ-బీజేపీ కలయికతో ఓట్ల పెరుగుదలతో పాటు.. గతంలో ఎన్డీఏ ఓట్లను చీల్చిన ఎల్‌జేపీ (రామ్ విలాస్) తిరిగి కూటమిలోకి రావడం కలిసొచ్చింది. జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ(రామ్ విలాస్) మూడు పార్టీలు కలిసిపోవడంతో.. ఈ ఏకపక్ష విజయం దక్కింది. అదే సమయంలో ఆర్జేడీ-జేడీయూలు పోటీపడిన కొన్ని సీట్లలో జేడీయూ అద్భుతంగా పుంజుకుంది. 2020లో 61 స్థానాల్లో ఆర్జేడీ 40-21తో గెలిస్తే.. 2025లో 59 స్థానాల్లో జేడీయూ 50-9 తేడాతో గెలుచుకోవడం.. ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.


ఎన్డీఏ గెలుపు వెనుక కారణాలు


జేడీయూ, బీజేపీ కలిసి దాదాపు 5 శాతం ఓట్లను పెంచుకున్నాయి. దీనికి కారణం రెండు పార్టీల మధ్య ఓట్ల ఏకీకరణ జరగడమే.


2020లో ఎన్డీఏ కూటమికి చెందిన ఓట్లను చీల్చి.. కనీసం 30 సీట్లలో ముఖ్యంగా జేడీయూకు నష్టం కలిగించిన ఎల్‌జేపీ (రామ్ విలాస్) తిరిగి కూటమిలో చేరింది.


ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్‌ఎల్‌ఎం కూటమిలో చేరడం కూడా ఎన్డీఏకు కలిసొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa