ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తనతో ఇదే నా చివరి ప్రయాణం’.. సతీవియోగంతో జనసేన నేత సత్య భావోద్వేగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 10:10 PM

జనసేన పార్టీ సీనియర్ నేత ఇంట విషాదం.. విశాఖపట్నానికి చెందిన నేత బొలిశెట్టి సత్యనారాయణ సతీమణి నాగమణి కన్నమూశారు. ఈ విషయాన్ని బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని సత్యనారక్ష్న ట్వీట్ చేశారు. నాగమణి మృతిపై జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలియజేశారు. ఆ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలంటూ జనసైనికులు ట్వీట్‌లు చేస్తున్నారు.


'ఇది నా జీవితంలో అత్యంత దుఃఖభరితమైన సమయాలలో ఒకటి.. నా జీవితంలో 4 మే 1983న అడుగుపెట్టిన నా ప్రియమైన భార్య నాగమణి, నా ప్రతి సంతోషం-సంక్షోభంలో నాతో నిలిచిన ఆమె, ఈరోజు ఉదయం 3:00 గంటలకు ఈ లోకాన్ని విడిచిపెట్టింది. నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె. ఆమెతో కలిసి నా హృదయంలోని ఒక భాగం కూడా వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి' అంటూ బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు.


‘‘మీ శ్రీమతి బొలిశెట్టి నాగమణి గారు పుణ్యాత్మురాలు. పవిత్రమైన కార్తిక మాసంలో అందునా ఏకాదశి నాడు బ్రహ్మముహూర్త కాలంలో సువాసినిగా మరణయాతన తెలియకుండా ఆమె సద్గతి పొందారు. విశ్వావసు సంవత్సర కార్తిక బహుళ ఏకాదశి


శుక్రవారం రాత్రి ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో చనిపోయారు. నవంబరు 17న కార్తీక సోమవారం నాడు దహన సంస్కారాలు జరిపించి.. మరుసటి రోజు అస్థి సంచయనం చేసి అస్థికలు, చితాభస్మం గోదావరిలో నిమజ్జనం చేయవచ్చు. మీ కులాచారం ప్రకారం పెద్దలను సంప్రదించి ఉత్తర క్రియలు జరిపించగలరు. వీలును బట్టి ప్రయాగ త్రివేణి సంగమంలో చితా భస్మం కలపితే మంచిది’’ అని తన మిత్రుడు ఎంవీఆర్ శాస్త్రి.. తన భార్య క్రియా కర్మల కోసం అవసరమైన సమయంలో అడగకుండానే ఈ సందేశాన్ని పంపించారని.. ఆమెకు సద్గతి దక్కిందన్న విషయం నా మనస్సుకు కాస్త ఊరట కల్పించిందని బొలిశెట్టి సత్య తెలిపారు. తన మిత్రుడి సూచనల ప్రకారం సోమవారం ఉదయం తన సతీమణి భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహించి, ఆదివారం పెద కర్మ జరుపుతామని తెలిపారు.


బొలిశెట్టి సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. ఆయన 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటిచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు.. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. న్యూస్ ఛానల్స్ డిబేట్లలో కూడా ఆయన జనసేన పార్టీ తరఫున మాట్లాడేవారు. అంతేకాదు ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ పరిణామాలతో పాటుగా సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌లపై విశ్లేషణలు చేస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa