ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఏఈ ఉత్తమ ఉద్యోగిగా భారతీయుడు.. రూ.24 లక్షలతో పాటు గోల్డ్ కాయిన్, యాపిల్ వాచ్!

international |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 08:47 PM

యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) ఉత్తమ ఉద్యోగి అవార్డును భారతీయుడు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన అనాస్ కడియారమ్.. ఎమిరైట్స్ ‘అత్యుత్తమ శ్రామికశక్తి’ అవార్డుకు ఎంపికయ్యాడు. బూర్జీ హోల్డింగ్స్‌కి చెందిన ఎల్ఎల్‌హెచ్ హాస్పిటల్ హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోన్న కోజికోడ్‌కు చెందిన అనాస్.. నైపుణ్యంతో కూడిన కార్మికుల సబ్‌కేటగిరీలోని ‘మేనేజ్‌మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్’ విభాగంలో పురస్కారం గెలుచుకున్నారు. ఈ అవార్డు అంష్టీల్‌ సైబర్‌సెక్యూరిటీ హెడ్‌ అబ్దుల్లా అల్‌బ్రికీతో కలిసి ఆయన పంచుకున్నారని గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ఈ అవార్డు కింద లక్ష దిర్హామ్‌లు (దాదాపు రూ.24 లక్షలు), గోల్డ్ కాయిన్, యాపిల్ వాచ్, ఫాజా ప్లాటినమ్ కార్డు, ట్రోఫీ, ఇతర బహుమతులను అందజేయనున్నారు.


అనాస్ మీడియాతో మాట్లాడుతూ... ‘మీ అభివృద్ధిని మేము చూశామని దేశం నాకు చెబుతున్నట్లు అనిపించింది.. యూఏఈ ప్రయివేట్ సెక్టార్ నేర్చుకోడానికి ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ విభాంలో చాలా అనుకూలమైంది.. . మా ఉద్యోగ బృందానికి సహాయం చేసే మరో అవకాశాన్ని ప్రతి రోజూ కొత్త సవాలు, కొత్త అవకాశం తీసుకొస్తుంది... నా బృందంతో కలిసి ఎదగడానికి నాకు అవకాశం లభించింది.. మా చైర్మన్ డా. షంసీర్ వయలిల్‌, అలాగే నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మేనేజ్‌మెంట్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి నమ్మకమే నేను ఎదగడానికి తోడ్పడింది’ అని తెలిపాడు.


ఇక, కడియారకం 2009లో LLH డే కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. గత 16 ఏళ్లలో క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం దానికి రీజినల్ హెచ్ఆర్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో బూర్జీ హెల్డింగ్స్ ఆధ్వర్యంలోని మఫ్రక్ కోవిడ్-19 హాస్పిటల్‌లో హెచ్ఆర్ ఆపరేషన్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించి, యాజమాన్యం ప్రశంసలు అందుకున్నారు. మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌కు మద్దతుగా నిలిచిన ఆయనకు యూఏఈ మెడల్, గోల్డెన్ వీసా లభించింది.


‘కోవిడ్ ప్రతి ఒక్కరికీ పరీక్షా కాలం.. రేయింబవళ్లు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మద్దతుగా నిలవడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. దేశం పట్ల నా నిబద్ధత’ అని అనాస్ అన్నారు. ఈ అవార్డు ఆరోగ్యకరమైన, మరింత మద్దతు ఇచ్చే పని ప్రదేశాలు ముందుకు సాగడానికి ఒక ప్రేరణ అని వ్యాఖ్యానించారు. యూఏఈ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ పీఎం, ప్రెసిడెన్షియల్ కోర్ట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్యర్యంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. విజేతలను ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్ షేక్ థియబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa