సౌదీ అరేబియాలో భారత ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఓ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 42 మంది యాత్రికులు మరణించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెంటనే స్పందించింది. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్: 8002440003, ఇతర ఫోన్ నెంబర్లు: 0122614093, 0126614276, వాట్సాప్ నెంబర్: 0556122301 అందుబాటులో ఉంచినట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa