కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో రాజకీయాలు వేడెక్కాయి. కేబినెట్ మార్పులకు అనుమతి కోరుతూ సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో మరోసారి చర్చలు జరపాలని ఖర్గే సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.శనివారం రాహుల్ గాంధీతో సమావేశమైన సిద్ధరామయ్య కేబినెట్ మార్పుల ఆవశ్యకతను వివరించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి మార్పుపై ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆ తర్వాతే ఇతర అంశాలు చర్చించాలని శివకుమార్ పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఇరు నేతలతో చర్చించిన ఖర్గే.. తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేసినట్లు కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa