రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా సోమవారం నాడు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజలో లోకేశ్ తో పాటు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, దేవాన్ష్ పాలుపంచుకున్నారు.కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో ఈ పూజలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇది ఒక మధురమైన జ్ఞాపకమని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.ఈ సందర్భంగా తాము రుద్రాభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు చేసినట్లు నారా బ్రహ్మణి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ పరమశివుని కరుణాకటాక్షాలు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కుటుంబ శ్రేయస్సుతో పాటు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa