ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో పసిడి పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరిగిన మహిళల 51 కిలోల ఫైనల్ పోరులో నిఖత్ జరీన్ 5-0 తేడాతో చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్‌పై అద్భుత విజయం సాధించారు. ఆమె అవిశ్రాంత కృషి, అజేయ స్ఫూర్తి భారతదేశం, తెలంగాణను గర్వపడేలా చేస్తున్నాయని, నేటి యువతులకు ఆమె ఒక ప్రేరణ అని కేటీఆర్ కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa