ఏలినాటి శని ప్రతి 30 ఏళ్లకోసారి వచ్చి మొత్తం ఏడున్నరేళ్లు ఉంటుందని ఆందోళన అవసరం లేదని జ్యోతిష పండితుల అంటున్నారు. శని పెళ్లిళ్లు, పదోన్నతులు వంటి శుభకార్యాలు ఆపడం జరగదని అంటున్నారు. శని 12, 1, 2 స్థానాల్లో రెండేళ్లు చొప్పున సంచరించడం వల్లే ఏలినాటి శని వస్తుందన్నారు. ప్రభావం తగ్గేందుకు విష్ణుసహస్రనామం, సుందరాకాండ, ఆదిత్యహృదయం పారాయణం, తీర్థయాత్రలు, శనివారాల్లో నల్లవస్త్రంతో నువ్వులు కట్టి దీపారాధన, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పక్షులకు–కాకులకు ఆహారం పెట్టడం వంటి పరిహారాలు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa