అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా కొత్త SUV భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కారు ధర రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ట్రెయిన్ ఆప్షన్స్, ఆరు కలర్లలో లభిస్తుంది. డిసెంబర్ 16 నుండి బుకింగ్లు, వచ్చే ఏడాది జనవరి 15 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు AWD టెక్నాలజీ కూడా ఉంది. ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa