రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 ప్రో 128GB మోడల్ భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. లాంచ్ ధరలో సగం కంటే తక్కువకే, అంటే రూ.58,000కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేస్తే 7.5% తక్షణ తగ్గింపుతో రూ.7,500 వరకు అదనపు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో టైటానియం బాడీ, A17 ప్రో చిప్, 6.1-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, 48MP ప్రైమరీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa