ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లలో పాత నోకియా 1100 మొదటి స్థానంలో నిలిచిందని హవ్ స్టఫ్ వర్క్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక వివరించింది. 2003లో విడుదలైన ఈ ఫోన్ 25 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడైంది. దీనికి కారణం దాని మన్నిక, టార్చ్ లైట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, తక్కువ ధర. ఆ తర్వాత స్థానాల్లో ఐఫోన్ 6, 6 ప్లస్ (22 కోట్లకు పైగా యూనిట్లు), శాంసంగ్ గెలాక్సీ S4 (8 కోట్ల యూనిట్లు), ఐఫోన్ 11 నిలిచాయి. ఐఫోన్ 6, 6 ప్లస్ 2014లో, శాంసంగ్ గెలాక్సీ S4 2013లో, ఐఫోన్ 11 2019లో మార్కెట్లోకి వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa