ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో కాగ్ కార్యాలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:16 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అమరావతిని పూర్తిస్థాయి, శక్తిమంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక బలమైన అడుగు అని కేంద్రమంత్రి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు ఈ అనుమతులు లభించాయని ఆయన అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa