విజయవాడ వేదికగా జరగనున్న యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు సీఎంను కలిసి టోర్నమెంట్ వివరాలు అందించారు.ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. పదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి సీఎంకు వివరించారు. టోర్నమెంట్ నిర్వహణకు క్రీడా శాఖ, పురపాలక శాఖ, శాప్ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa