ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సీకి, అభిమానులకు ఆమె క్షమాపణలు తెలిపారు. ఏర్పాట్లు సరిగా లేవని, మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అభిమానులు స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa