మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిని గోనె సంచిలో కట్టి, కారులో బంధించి నిప్పంటించి సజీవదహనం చేశారు. ఈ ఘటన నిన్న జరుగగా, పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళ్తే, ఆసా తాండకు చెందిన గణేశ్ చవాన్ అనే యువకుడు ఐసీఐసీఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని ఓ సంచిలో బంధించి, అతని కారులోనే ఉంచి నిప్పంటించారు. గణేశ్ ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని కోసం గాలించారు. ఈ క్రమంలోనే వారికి ఈ ఘోర ఘటన గురించి తెలిసింది."తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో వనవాడ రోడ్డులో ఓ కారు తగలబడుతోందని మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పిన తర్వాత, కారులో పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించాం. పోస్ట్‌మార్టం నిర్వహించి, దర్యాప్తు కొనసాగిస్తున్నాం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa