ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 37 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుతోపాటు మిగిలిన నిందితులపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ నివేదిక సమర్పించడంతో విచారణను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. వైసీపీ అధికారంలో ఉండగా నమోదైన ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆ టైంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa