రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆధ్వర్యంలో, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైనిక శక్తిగా రష్యా తన బలాన్ని చాటుకుంది. అక్టోబర్ లో పోసిడాన్ అనే నీటి అడుగున అణు జలాంతర్గామి డ్రోన్ ను విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ స్వయంగా వెల్లడించారు. ఈ డ్రోన్ రేడియోధార్మిక సునామీని సృష్టించి, నగరాలను నిమిషాల్లో నాశనం చేయగలదని, భవిష్యత్ తరాలకు కూడా ముప్పు కలిగిస్తుందని రష్యన్ వ్యూహకర్తలు తెలిపారు. టైటానియం మిశ్రమంతో, 100 నాట్ల వేగంతో, నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ డ్రోన్ లో చిన్న న్యూక్లియర్ రియాక్టర్ అమర్చబడి ఉంది. దీనిని ఆపడానికి సాంకేతికత ఎవరి దగ్గరా లేదని పుతిన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa